లినక్స్ ఉండగా విండోస్ ఇంస్టాల్ చేశారా?

ఒక వేళ మీరు లినక్స్ ఇంస్టాల్ చేశాక విండోస్ ఇంస్టాల్(వేరొక పార్టిషంలో) చేసినట్టైతే, మీరు బూట్ చేయగానే విండోస్ బూట్ అవుతుంది, లినక్స్ కు వెళ్ళే ఆప్షన్ కనపడదు. దీనికి పరిష్కారం….

1. మీ దగ్గరున్న లినక్స్ CD/DVDని బూట్ చేసి టర్మినల్ తెరవండి.

2. sudo grub అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. క్రిందటి వరుసలో grub> అని వస్తుంది.

3. find /boot/grub/stage1 అన్న కమాండ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. (hd0,1) ఇలా ఉన్న అక్షరాలు వస్తాయి. ఒక వేళ error వస్తే ఇది చూడండి.

4. root (hd0,1) అని ఇవ్వండి. ఈ ఉదాహరణలో (hd0,1) తీసుకొన్నాను, మీరు మాత్రం మీకు వచ్చినదాన్నే ఇవ్వాలి.

5. setup (hd0) అన్న కమాండ్ ఇవ్వండి. ఐదారు లైన్లు వచ్చి, చివరి దాంట్లో Done అని వస్తుంది.

ఇప్పుడు రీస్టార్ట్ చేయగానే మీరు లినక్స్ కు వెళ్ళాలా లేక విండోస్ కు వెళ్ళాల అని సూచించే ఆప్షంలు వస్తాయి. మీకు కావలసినది ఎంచుకోవచ్చు.