gl-117 నాకు నచ్చిన ఒక ఆట…

అన్ని రకముల ఆపరేటింగ్ సిస్టంలకూ ఈ గేం యొక్క డౌంలోడ్ ఫైల్ ఇక్కడ లభిస్తుంది.

ఎందుకు?

చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతున్న విషయాల్లో ‘లినక్స్ లో విండోస్ కన్నా ఎక్కువ గేంస్ ఉంటాయి’ అన్న వ్యాఖ్య. ఒక రోజు TV9లో 30Minutes ప్రోగ్రాంలోనూ ఈ విష్యం విన్నాను. కానీ నాకు ఒక నెల ముందుటి వరకూ దీనికి మంచి ప్రూఫ్ దొరకలేదు.

Accessoriesలో ఉన్న Add/Remove క్లిక్ చేసి, ఎడమ(left) వైపు ఉన్న Games సెలెక్ట్ చేసుకొన్నా. పై వైపు Show అని ఒక DropDown మెనూ ఉంది, అందులో ‘All available applications’ను సెలెక్ట్ చేసుకొన్నా. అంతే క్రింద లిస్టులోటి పేర్లు చదవటానికే అర గంట పట్టింది.

ఏమిటి?

చాలా గేంస్ కనపడ్డాయి, కానీ ఎక్కువ శాతం చిన్నవి, అంటే విడోస్ లో ఇంస్టాల్ చేయగానే వచ్చే Solitire లంటివి. కానీ నాకు ఫ్లైట్ సిములేటర్ లాంటి కత్తిలాంటి గేం కోసం వెతికా, FlightGear దొరికింది కానీ అది చాలా పెద్దది(200MB), RAMను కూడా బాగా తింటుంది(2GB కనీసం ఉండాలి). అలా వెతుకుతూ పొతూ ఉంటే కనిపించిందండీ gl-117. ఇది కేవళం C++తో తయారు చేయబడిందని తెలియగానే నమ్మలేకపోయాను. అంతే కాదు, దీని సైజు చూడగానే, కాసేపు నమ్మాలో వద్దో అర్థం కాలేదు. ఇది కేవళం 2.3MB ఉందేంటి అనిపించింది.

ఎలా?

ఉబుంటూలో ఇంస్టాల్ చేయటం వరకూ నేను చెప్పగలను. టెర్మినల్ ఓపెన్ చేసి

sudo apt-get install gl-117

అన్న కమ్యాండు టైప్ చేసి ఎంటర్ నిక్కండి, మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఇవ్వండి. అంతే, కాసేపటికి ఇంస్టాల్ అవుతుంది.

మొదట్లో ఆడటం అర్థం కాలేదు, ఒక రోజు పాటు పక్కన పెట్టేసా, కానీ ఆడటం అర్థం అయ్యక ఒక్క రోజంతా ఆడి లెవెల్స్ అన్నీ అవ్వగొట్టేశా.

ఆడటం :

విమానాన్ని కదలించటానికి Mouse వాడాలి.

మిసైళ్ళు ప్రయోగించుటకు – Right Click(Mouse) లేదా Enter

గన్ను పేల్చుటకు – Left Click(Mouse) లేదా SpaceBar

వేగంగా వెళ్ళటానికి – S

నెమ్మదిగా వెళ్ళటానికి – X

ఛాఫ్ వదలటానికి – C

ఫ్లేర్ వదలటానికి – F

Campaignలో ఒక లెవెల్ పూర్తి చేసాకే మరొకటి వస్తుంది. Trainingలో ఏ లెవెలైనా ఆడవచ్చు. Campaignలో మొత్తం 25 లెవెల్స్ ఉంటాయి.

ప్రకటనలు

ఒక స్పందన to “gl-117 నాకు నచ్చిన ఒక ఆట…”

  1. vijayamadhavareddy Says:

    fedora installation
    su
    yum install gl-117

    అదే openSUSE installation అయితే

    su
    yast2 install gl-117

    నాకు తెలిసి ఇలాగే వుంటుంది. ఇవి వున్న వాళ్ళు ప్రయత్నించి చెప్పడి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: