తెలుగులోనే ఎందుకు?

మన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చదువుకొనే పిల్లల్లో, 78శాతం పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారు, వచ్చే 10సంవత్సరాలలో ఈ సంఖ్య మహా అంటే 50శాతానికి తగ్గుతుందని అంచనా. కావున వచ్చే 20సంవత్సరాలలో తెలుగు మీడియంలో చదివినవారు ఇంగ్లీషు మీడియం చదివినవారికన్నా ఎక్కువగానే ఉంటారని, వారికి కంప్యూటర్ వాడటానికి ఇంగ్లీషు ఆటంకం కాకూడదని, వారి అనుమానాలకూ మరియు అపోహలకూ తెలుగులో పరిష్కారం దొరికేలా చూడటం కొరకు చేసే ప్రయత్నమే ఈ బ్లాగును తెలుగులో వ్రాయటానికి గల కారణం.

అంతే కాకుండా మాతృ భాష తెలుగు ఐన వారికి ఎంత ఇంగ్లీషు వాడుతున్నప్పటికీ, చాలా విషయాలు తెలుగులోనే సులభంగా అర్థం అవుతాయన్నది వాస్తవం.

“వాన చినుకు చిన్నదే అయినప్పటికీ దానికోసం ఎదురు చూసే మర్రి విత్తనం ఎక్కడో ఉండే ఉంటుందని నా నమ్మకం”

ప్రకటనలు

10 వ్యాఖ్యలు to “తెలుగులోనే ఎందుకు?”

 1. చక్రవర్తి Says:

  అయ్యా!!

  చక్కగా వ్రాయగలరు. ఎందుకు రాసుకుంటారు అని నేను మిమ్ములను ప్రశ్నించను.
  ఇకపై రాసుకోకుండా, వ్రాయగలదని మనవి.

  ఇది ఒక మనవి మాత్రమే, లేదా ఒక విన్నపము, లేదా ఒక విఙ్ఞప్తి, ఒక కోరిక..

 2. చక్రవర్తి Says:

  నా మనవిని మన్నించి సరిదిద్దుకున్నందులకు కృతఙ్ఞతలు.

  తప్పులెన్ను వారు తమ తప్పులెరగరయా అన్నట్లు .. నా తప్పులేమైనా ఉన్న యడల సరిదిద్ద మని ప్రార్ధన

 3. abhilash Says:

  hi gavesh
  kacchitanga na saayam untundhi
  kaka pothe konni rojulu taravata

  manchi prayatnam……….

  telugu lo ela comments raayalo telupa galaru

 4. Rao Vemuri Says:

  చాలా బాగుంది.
  కంప్యూటర్ ని ఉపయోగించి, తెలుగుని మాధ్యమంగా తీసుకుని, క్రమబద్ధంగా ఒక ప్రణాళిక రూపొందించాలనే కోరిక ఒకటి ఉంది. ఈ కోరికకి ఒక రూపం రావాలంటే ఉత్సాహం ఉన్న మీ వంటి వ్యక్తులు కావాలి. ఈ ప్రణాళికకి కావలసిన ఘటకసామగ్రి: (1) తెలుగు మాటలని ఉపయోగించి అంతర్జాలాన్ని సోధించగలిగే స్థోమత. ఈ రకం స్థోమత అప్పుడే గూగుల్ వంటి శోధన యంత్రాలకి ఉందని విన్నాను. (2) వెతకటానికి తెలుగులో రాసిన పదార్ధం. తెలుగు వికీపీడియా, తెలుగు బ్లాగులు వస్తున్నాయి కనుక మన ప్రయోగానికి సరిపడా పదార్ధం ఉందనే అనుకుంటున్నాను. (3) అందరికీ అందుబాటులో ఉండి, అంతర్జాలానికి లంకె వేయగల వేదిక. అందరికీ అందుబాటులో ఉన్న “సెల్ ఫోను” ఈ వేదికగా పనికొస్తుందా? అని ఒక అనుమానం నన్ను వేధిస్తోంది. ఈ మూడు సమకూడినప్పుడు, తెలుగు దేశంలో ఏ మూల నుండి అయినా ప్రశ్నలు అడగగలగటం, అడిగిన ప్రశ్నలకి సాధ్యమయినంత వరకు తెలుగులోనే సమాధానాలు ఇవ్వగలిగే “ఇంటర్ఫేస్” ని నిర్మిస్తే ఎలాగుంటుందని ఒక ఊహ నాకు ఉంది. కంప్యూటర్ సాఫ్‌ట్‌వేర్ రంగంలో కొమ్ములు తిరిగిన తెలుగువాళ్ళు ఇంతమంది ఉండగా ఈ రకం పని మనం చెయ్యగలమనే అనుకుంటున్నాను. అప్పుడు కలనయంత్రాల ప్రభావం పల్లెపట్టులలోకి కూడ ప్రసరిస్తుంది. ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న వ్యక్తులయితే మరీ మంచిది. నేను ఆగష్టులో భారతదేశం వచ్చినప్పుడు ఈ ప్రణాళికని చేపట్టి ఊపిరిపొయ్యాలనే ఆలోచనలో ఉన్నాను. యూనిక్స్ ప్రోజెక్టులా దీనికి కూడ “రామ దండు” కావాలి.
  ఈ ప్రణాళిక మీద ఉత్సాహం ఉన్నవాళ్ళు స్పందించండి.

 5. Gavesh Says:

  మీలాగే నాకన్నా బలమైన దృక్పతం కల వ్యక్తి ఉన్నాడు. అతన్ని http://tidbits.co.in లేదా http://techsetu.com/home సంప్రదించగలరు… ఈ బ్లాగుకు స్ఫూర్థి అతనే.

 6. Rao Vemuri Says:

  ee article chala bagundi..
  ee bhashs ki chendina varaina moodu mathrukalu..marichipokudadu…
  1. mathru moorthi..thalli…
  2. mathru bhasha …thalli..nerpe bhasha…
  3. mathru bhoomi…puttina gadda..
  avasaraanni batti anya bhashalu nerchukovachunu kani..mathru bhasha ki saati…maroti ledu..
  dayachesi..ee bhavana ..vistruthanga pracharam cheyandi…
  thaku…bye…
  prasad…

 7. Gopal Says:

  “వాన చినుకు చిన్నదే అయినప్పటికీ దానికోసం ఎదురు చూసే మర్రి విత్తనం ఎక్కడో ఉండే ఉంటుందని నా నమ్మకం.”

  నా ప్రెజంటేషన్ లో ఈ వ్యాఖ్య తప్పకుండా పెడతాను.. మనం అనుకున్న దానికి సరిగ్గా సరిపోతుంది 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: