పార్టీలకు అతీతంగా అందరినీ, కాస్తైనా భాధపెట్టిన వార్త : మన ముఖ్యమంత్రి మరణం!

ఎవరేమన్నా వై.ఎస్ ఇక లేరు. ఇది కొందరికి చాలా భాధ కలిగించే విషయం, మరి కొందరికి కాస్తైనా భాధ లేక జాలి కలిగించే విషయమని చెప్పవచ్చు.

ఏ సమాచారం ఎప్పుడు జాతీయ వార్తల్లో వచ్చింది అన్న విషయం క్రింద క్లుప్తంగా వివరించాను.

సెప్టెంబర్ 2 :

సాయంత్రం 06:00 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడుటలేదు.
సాయంత్రం 06:05 : ఆయన హెలికాప్టర్ చిత్తూరుకు ఉదయం బయలుదేరింది.
సాయంత్రం 06:20 : ఉదయం 9:12 చివరిసారిగా ముఖ్యమంత్రి హెలికాప్టర్ సంకేతాలు పంపింది.
సాయంత్రం 06:25 : కర్నూలు దగ్గర హెలికాప్టర్ అదృశ్యం.
సాయంత్రం 06:27 : రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.
సాయంత్రం 06:30 : భూమి ఉపరితలానికి అతి చేరువలో పయనించగల విమానాన్ని బరిలోకి దించారు.
సాయంత్రం 06:35 : వెతకటానికి ఏడు హెలికాప్టర్‌లను పంపారు.
సాయంత్రం 06:36 : సచ్చివాలయానికి వెళ్ళి, జరుగుతున్న పనులను సమీక్షించిన జే.పీ.
సాయంత్రం 06:45 : యాంటీ-నక్సల్స్ ఫోర్సును కూడా పంపారు.
సాయంత్రం 06:48 : ఆ హెలికాప్టర్‌కు ఎగరటానికి అర్హతలేదు అన్న DGCA. దానికి చివరి సేఫ్టీ పరిక్ష రెండేల్ల క్రితం జెరిగింది.
సాయంత్రం 06:50 : ISROని కూడా రంగంలోకి దించారు.
సాయంత్రం 07:00 : హెలికాప్టర్‌లలో వెతకటం నిలిపి వేశారు.
రాత్రి 07:15 : Sukhoi 30S విమానాన్ని రాత్రంతా వెతకటానికి నియమించారు.
రాత్రి 07:35 : మొయిలీని హైదరాబాదుకు పంపిన కాంగ్రెస్.
రాత్రి 07:40 : సుభవార్త ఏమీ లేదు – చిదంబరం.
రాత్రి 07:45 : నాయుడు మరియూ చిరంజీవి యొక్క పార్థనలు.
రాత్రి 07:50 : వాతావరణం అనుకూలించనందున ఏరియల్ సర్చిని నిలిపివేశారు.
రాత్రి 07:55 : యాంటీ-నక్సల్ ఫోర్స్ గ్రే-హౌండ్స్ పంపారు.
రాత్రి 07:58 : వై.ఎస్.ఆర్ భార్యకు ఫోన్ చేసిన సోనియా గాంధీ.
రాత్రి 08:02 : గంటలో రానున్న ISRO ఇమేజిలు.
రాత్రి 08:05 : అమెరికా డిఫెన్‌స్ సాయం కోరిన భారత ప్రభుత్వం.
రాత్రి 08:07 : 20 సెర్చి టీంలు వెతుకుతున్నాయి.
రాత్రి 08:10 : వెళ్ళల్సిన దారిలో పైలెట్ వెళ్ళలేదు అన్న వార్త.
రాత్రి 08:16 : ప్రత్యేక ISRO విమానాన్ని బరిలోకి దింపారు.
రాత్రి 08:20 : మరికొన్ని దళాళను రెపటికి పంపుతాం.
రాత్రి 08:28 : హైదరాబాదుకు రానున్న సోనియా.
రాత్రి 08:31 : హెలికాప్టర్‌ను వెతకటానికి స్యాటిలైట్ ఇమేజిలను వాడుతున్నరు.
రాత్రి 08:35 : సోనియాకి ఫోన్ చేసిన ప్రనభ్ ముఖర్జీ.
రాత్రి 08:37 : ఎమర్జెంసీ లొకేషన్ ట్రాంస్పాండర్ వాడుక.
రాత్రి 08:42 : ముఖ్యమంత్రి ప్రయానించిన హెలికాప్టర్ పైలెట్లకు ట్రైనింగ్ ఇవ్వటానికి వాడేదట.
రాత్రి 08:46 : థర్మల్ ఇమేజింగ్ ఉపకరణాలు వాడనున్న ఆర్మీ.
రాత్రి 08:50 : ఆరు జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్‌లు.
రాత్రి 08:51 : హెలికాప్టర్ చూసినట్టుగా వచ్చిన సమాచారం ప్రకారం నల్లమలలో సెర్చి.
రాత్రి 08:52 : ఉపరితలానికి దగ్గరగా పయనించే విమానం తీసిన ఇమేజిలు అందుబాటులోకి.
రాత్రి 08:55 : నక్సల్‌స్ అటాక్ కాదని తేల్చివేత.
రాత్రి 09:00 : రేపు ఉదయానికి అన్ని ఇమేజిలనూ పరిశీలిస్తాం.
రాత్రి 09:05 : రాత్రి మొత్తం వెతకటానికి సెర్చి ఆపరేషన్‌లను ఆర్డర్ చేశారు.
రాత్రి 09:12 : హైదరాబాద్ ATC, రెండు గంటలా నలభై ఐదు నిమిషాలు ప్రయానించగల ఇందనం ఉందని నిర్ధారన.
రాత్రి 09:16 : నక్సల్‌స్ చరిత్ర ఉన్న ఆంధ్రాలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
రాత్రి 09:20 : రాడార్లు వాడి, మేఘాలలో నుంటీ చూడగలిగే సామర్థ్యం ఉన్న విమానాలని రంగంలోకి దించారు.
రాత్రి 09:26 : హెలికాప్టర్‌ను కూల్చే శక్తి నక్సల్‌స్ కి లేదు :NSA
రాత్రి 09:32 : జగన్‌తో మాట్లాడిన సోనియా.
రాత్రి 09:37 : యుద్ద ప్రాతిపదికతో రెస్క్యూ ఆపరేషన్‌లు.
రాత్రి 09:42 : పోలీసులు రాత్రంతా గాలించటానికి సన్నాహాలు.
రాత్రి 09:43 : క్రిష్నా నదిని వెతుకుతున్న బోట్లు.
రాత్రి 09:43 : కూలిపోయినప్పుడు వెలువడే సంకీతాలేవీ అందలేదు.
రాత్రి 09:46 : అదనపు బలగాలను ముమ్మరం.
రాత్రి 09:50 : పొద్దు పొడవగానే నాలుగు హెలికాప్టర్లతో సెర్చి.
రాత్రి 09:55 : శకలాలు లేదా ముఖ్యమంత్రి కనపడేదాకా వెతుకుతాం – NSA
రాత్రి 10:00 : అత్యాదునిక పరికరాల వాడుక.
రాత్రి 10:08 : నిపుణులైన పైలెట్లే నడిపారు.
రాత్రి 10:10 : హెలికాప్టరు ఎగిరే అర్హత కలిగినదే – ఆంధ్రా ప్రభుత్వం.
రాత్రి 10:15 : ఇప్పటిదాకా 41 ఫోటోలని తీసిన ISRO.
రాత్రి 10:20 : 20కి.మీ లకు పరిమితం చేసిన సెర్చి ఆపరేషన్.
రాత్రి 10:22 : రేపు ఉదయాన 9:30 కలవనున్న కోర్ కమిటీ.
రాత్రి 10:27 : ఈ అటవీ ప్రాంతంలో రానున్న 48గంటలలో భారీ వర్షాలు.
రాత్రి 10:35 : వెతకమని ప్రజలకు విజ్ఞప్తి – ప్రభుత్వం.
రాత్రి 10:35 : హెలికాప్టర్ నేలకూలిందని ISRO ఫోటోలో గుర్తింపు.
రాత్రి 10:47 : ఇమేజిలను పరిశీలించటానికి నాలుగు లేదా ఐదు గంటలు పట్టచ్చంటున్న ISRO.
రాత్రి 10:59 : రేపు మరి కొన్ని దళాల పంపకం.
రాత్రి 11:00 : భారత రాజకీయవేత్తలకు గాలిలో జెరిగిన ప్రమాదాలేమీ కొత్త కాదు.
రాత్రి 11:05 : అడ్డుకుంటున్న భారీ వర్షం.
రాత్రి 11:15 : ఉదయం ఆరున్నరకు మొదలవ్వనున్న ఎయిర్ సెర్చ్.
రాత్రి 11:20 : హెలికాప్టర్‌ను సురక్షితంగా దించి ఉంటారన్నది కలే.
రాత్రి 11:25 : నైట్ విజన్‌తో గాలిస్తున్న సుకోయ్ విమానం.
రాత్రి 11:40 : డోర్నియర్ 228 ట్విన్ ఇంజన్ విమానాన్ని, ఎలహంక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండీ పంపకం.
రాత్రి 11:50 : CRPF యొక్క ఐదు కంపెనీల సహాయం – హోం మినిస్ట్రీ.
రాత్రి 11:55 : “నెలకు రెండు మూడు పల్లెల్లో ఆకస్మిక తనికీలు జరుపుతా” – హెలికాప్టర్ ఎక్కుతూ అన్న YSR మాటలు వెలుగులోకి.

సెప్టెంబర్ 3 :

రాత్రి 12:03 : డిసెంబర్ 5, 2010 వరకూ పరిమితి ఉన్న హెలికాప్టర్ అది – సివిల్ ఏవిఏషన్.
రాత్రి 12:45 : ఫోకస్ ఏరియా 200-400 స్క్వయర్ కిలోమీటర్లు.
రాత్రి 01:15 : ప్రధాని ప్రతిభా పాటిల్ విచారణ వ్యక్తం.
రాత్రి 02:35 : భారీ వర్షం.
ఉదయం 05:00 : ISRO మళ్ళీ 41 ఇమేజీల సేకరణ.
ఉదయం 06:00 : ISROకు కనపడని హెలికాప్టర్.
ఉదయం 06:10 : అమెరికా ఇమేజీలు కూడా వ్యర్థమే.
ఉదయం 06:20 : ఎడతెగని వర్షం.
ఉదయం 06:30 : 5కీ.మీ లకు తగ్గించిన సెర్చి ఏరియా.
ఉదయం 06:32 : మొయిలీ మరియూ ప్రిత్వీరాజ్ హైదరాబాదులో.
ఉదయం 06:36 : హైదరాబాదుకు రానున్న సోనియా.
ఉదయం 06:50 : కర్నూలు నుండి బయలుదేరిన నాలుగు హెలికాప్టర్లు.
ఉదయం 06:55 : 700 మంది పల్లె ప్రజలు పోలీసులకు సహకారం.
ఉదయం 07:00 : ఆత్మకూరు నుంటీ ప్రవేశించనున్న గ్రే-హౌండ్లు.
ఉదయం 07:10 : మాజీ నక్సల్‌స్ చేతకూడా సహాయక చెర్యలు.
ఉదయం 07:30 : కార్టోసాట్-1 మరియూ కార్టోసాట్-2 వాడుతున్న ISRO.
ఉదయం 07:40 : శాటిలైట్లు, ఒకటి 9:30కు మరొకటి 10:30 భారత్ మీదుగా పయనిస్తాయి.
ఉదయం 07:50 : క్రిష్ణా నదిలో పెంచిన సెర్చి.
ఉదయం 08:10 : 225 స్క్వయర్ కీ.మీ లకు తగ్గించిన సెర్చి ఏరియా.
ఉదయం 08:50 : ప్యారా కమాండో బెటాలియంలను సర్వీసులోకి.
ఉదయం 08:55 : కర్నూలుకు 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఉందని అనామక సమాచారం.
ఉదయం 08:55 : కర్నూలుకు 49 నాటికల్ మైళ్ళ దూరంలో ఉందని నిర్ధారన.
ఉదయం 08:58 : వెళ్ళికొండలో కనబడిన హెలికాప్టర్.
ఉదయం 09:00 : హెలికాప్టర్‌ను కనుగొన్న ఎయిర్‌ఫోర్సు.
ఉదయం 09:02 : బ్రతికి ఉండటం అనుమానమే.
ఉదయం 09:03 : అరగంటలో సంగటనా స్థలానికి చేరుకోనున్న సెర్చి టీంలు.
ఉదయం 09:05 : కచ్చితంగా క్రాష్ అని చెప్పలేం.
ఉదయం 09:07 : సంగటనా స్థలానికి బయలుదేరిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.
ఉదయం 09:09 : ఎయిర్‌ఫోర్సు హెలికాప్టర్ ల్యాండ్ అవటానికి అనుకూలించని దట్టమైన అడవి.
ఉదయం 09:14 : గల్లోనుంటే వెతుకుతున్న హెలికాప్టర్లు.
ఉదయం 09:15 : 24గంటల తరువాత కంపడిన ముఖ్యమంత్రి హెలికాప్టరు.
ఉదయం 09:19 : మన్మోహన్‌తో మీటింగులో ఉన్న చిదంబరం.
ఉదయం 09:24 : 20నుమిషాలలో చేరుకోనున్న సెర్చి టీములు.
ఉదయం 09:30 : రొల్ల పెంట మరియూ రుద్రకుంట మద్యలో కనపడిన హెలికాప్టరు.
ఉదయం 09:55 : హెలికాప్టర్ దారుణమైన పరిస్థితిలో ఉన్నదని అందిన సమాచారం.
ఉదయం 09:57 : ఎటువంటి అవాంతరాన్నైనా ఎదురుకొనేందుకు, MHA ఫోర్సులను సిధ్దం.
ఉదయం 09:58 : కమాండోలు ముఖ్యమంత్రి హెలికాప్టర్ దగ్గరలో దిగారు.
ఉదయం 10:15 : హెలికాప్టర్ కూలిపోయినట్టుగా ఉంది – యూనియన్ హోం మినిస్టరీ.
ఉదయం 10:20 : ప్యారాచూట్ల సాయంతోకమాండోలు రుద్రకొండకు 8కీ.మీల దూరంలో ఉన్న శ్రీశైలం కొండపై దిగారు.
ఉదయం 10:30 : మీడియాకు విషయం తెలియజేయనున్న కమాండర్ భారత్.
ఉదయం 10:44 : ఘాటక్ ప్లాటూంలు సంగటనా స్థలానికి చేరిక.
ఉదయం 10:48 : ఐదు మృతదేహాలని గుర్తించినట్టు సమాచారం.
ఉదయం 10:50 : ముఖ్యమంత్రి మరణాన్ని నిర్ధానించిన ప్రధాన మంత్రి సమావేశం.
ఉదయం 10:51 : 09:50కి ఐదు మృతదేహాలని గుర్తించినట్టు సమాచారం.
ఉదయం 11:01 : హెలికాప్టరు చిందరవందరగా, కాలిపోయిందని నిర్ధారణ.
ఉదయం 11:03 : పోస్టు మార్టంకు పంపబడిన మృతదేహాలు.
ఉదయం 11:32 : యాక్టింగ్ సీ.ఏం గా నియమించబడ్డ ఫైనాంస్ మినిస్టర్ రోశయ్య
ఉదయం 11:40 : రాష్ట్ర నలుమూలల నుండీ హైదరాబాద్‌కు తరలి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
ఉదయం 11:45 : ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానన్న చంద్రబాబు.
ఉదయం 11:52 : సాయంత్రం ఐదుకు హైదరాబాదుకు చేరనున్న ముఖ్యమంత్రి మృతదేహం.
ఉదయం 11:58 : సెలవు ప్రకటించిన తమిలనాడు.
మద్యాహ్నం 12:30 : ప్రజలు నివాళులు అర్పించటానికి మృతదేహాన్ని లాల్ బహదూర్ స్టేడియంలో సెప్టెంబర్ నాలుగున ఉదయం 10:00 నుంటీ మద్యాహ్నం 1:00 వరకూ ఉంచటం జెరుగవచ్చు.
మద్యాహ్నం 01:00 : ఇవాళ, రేపు ఆంధ్రాలో సెలవు ప్రకటన.
మద్యాహ్నం 01:05 : కొండకు డీకొని హెలికాప్టర్ పేలిపోయి ఉన్నట్టుగా కనిపిస్తోంది.
మద్యాహ్నం 01:25 : వార్త విని 8 మంది గుండెపోటుతో మరణించారు.

మూలం.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు to “పార్టీలకు అతీతంగా అందరినీ, కాస్తైనా భాధపెట్టిన వార్త : మన ముఖ్యమంత్రి మరణం!”

  1. వై.యస్. ఇక లేరు « తేజస్వి Says:

    […] నా మిత్రుడు గవేష్ నాకు అందించిన ఈ లంకెను మీరు […]

  2. chinni Says:

    విపులంగా అందించారు.ధన్యవాదాలు.

  3. thammida siva Says:

    y s jagan CM kavali other wise people creates a ……..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: