లినక్స్ ఉండగా విండోస్ ఇంస్టాల్ చేశారా?

ఒక వేళ మీరు లినక్స్ ఇంస్టాల్ చేశాక విండోస్ ఇంస్టాల్(వేరొక పార్టిషంలో) చేసినట్టైతే, మీరు బూట్ చేయగానే విండోస్ బూట్ అవుతుంది, లినక్స్ కు వెళ్ళే ఆప్షన్ కనపడదు. దీనికి పరిష్కారం….

1. మీ దగ్గరున్న లినక్స్ CD/DVDని బూట్ చేసి టర్మినల్ తెరవండి.

2. sudo grub అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. క్రిందటి వరుసలో grub> అని వస్తుంది.

3. find /boot/grub/stage1 అన్న కమాండ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. (hd0,1) ఇలా ఉన్న అక్షరాలు వస్తాయి. ఒక వేళ error వస్తే ఇది చూడండి.

4. root (hd0,1) అని ఇవ్వండి. ఈ ఉదాహరణలో (hd0,1) తీసుకొన్నాను, మీరు మాత్రం మీకు వచ్చినదాన్నే ఇవ్వాలి.

5. setup (hd0) అన్న కమాండ్ ఇవ్వండి. ఐదారు లైన్లు వచ్చి, చివరి దాంట్లో Done అని వస్తుంది.

ఇప్పుడు రీస్టార్ట్ చేయగానే మీరు లినక్స్ కు వెళ్ళాలా లేక విండోస్ కు వెళ్ళాల అని సూచించే ఆప్షంలు వస్తాయి. మీకు కావలసినది ఎంచుకోవచ్చు.

ప్రకటనలు

9 వ్యాఖ్యలు to “లినక్స్ ఉండగా విండోస్ ఇంస్టాల్ చేశారా?”

 1. నల్లమోతు శ్రీధర్ Says:

  చాలా యూస్ ఫుల్ పోస్ట్. ధన్యవాదాలు.

 2. చంద్ర మోహన్ Says:

  చాలా మంచి విషయం చెప్పారు. సరిగ్గా నాలుగురోజుల క్రితం నా లాప్ టాప్ లో అలాగే ఐతే ఇంటర్నెట్లో వెతికి నానా కష్టాలూ పడి మళ్ళీ బూట్ మెనూ తెచ్చుకొన్నాను.

  లినక్సు గురించి తెలుగులో దొరికే సమాచారం చాలా తక్కువ. మీరు ఇలాగే మంచి మంచి టిప్సు వ్రాస్తూ ఉండాలి.

 3. సూర్యుడు Says:

  Excellent, I too faced this problem two weeks back when I was trying to install FreeBSD in one of the partitions and lost my MBR and partition info. I followed the steps in the following links to recover everything without loosing any data, lucky me 😉

  http://ubuntuforums.org/showthread.php?p=2210436
  http://www.techrecipes.net/linux/recover-lost-partition-table-using-ubuntu-live-cd.html

  Of course for recovering the boot menu, I followed the steps that you mentioned but I don’t remember the link I used for that.

  One very important aspect of open source, especially Linux is that you get plenty of information on net. Just you need to look for the right key words 🙂

  ~sUryuDu 🙂

 4. Gavesh Says:

  మంచి లంకెలు ఇచ్చారు, ధన్యవాదములు

 5. kmcmohan Says:

  నిజానికి నా లాప్ టాప్ లో find /boot/grub/stage1 కమాండ్ ఇచ్చినప్పుడు రెండు పార్టిషన్లు చూపించింది – (hda0,4) (hda0,6)అని. అలోచిస్తే అప్పుడెప్పుడో SUSE Linux ఇన్స్టాల్ చేసి వదిలేసినట్లు గుర్తొచ్చింది. ఐతే ఆ రెండింటిలో నాకు కావలసిన పార్టిషన్ ఏదో తెలుసుకోవడం ఎలా? నేను ధైర్యం చేసి ఒక గెస్ చేశాను, అది కరెక్టయింది అదృష్టం కొద్దీ. అలాగే ఆ రెండో పార్టిషన్ డిలీట్ చేయడం ఎలాగో కూడా చెప్పగలరు.

  నెనర్లు!

  • Gavesh Says:

   (hd0,4) అని వస్తే అది /dev/sda3 పార్టిషన్ అయ్యుంటుంది(99%). Gpartedలో /dev/sda3 అన్నది, ఏ పార్టిషన్ అన్న విషయం తెలుసుకోవచ్చు(format size freespace వంటి వాటి సాయంతో). అంటే మీకు find /boot/grub/stage1 యొక్క output (hd0,x) ఐతే అది /dev/sda’x-1′ పార్టిషన్ అన్నమాట. ఒక వేళ మీరు గెస్ చేసినా ప్రమాదమేమీ లేదు(ఒక రీస్టార్ట్ సమయం తప్ప), grub error వస్తే మల్లీ ఇంకొక దాన్ని ఎంచుకొని ప్రయత్నించవచ్చు. పార్టిషన్ డిలీట్ చేయటం కూడా partition editor ద్వారా చేయ వచ్చు. సాధారనంగా partition editor లైవ్ బూట్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది(ఆటలాడేది కాదు కదా మరి). మీరెలాగో grubను వెనక్కు సాధించారు కాబట్టి మీరు లైవ్ cd ద్వారా బూట్ అవ్వకుండా partition editorను వాడాలనుకుంటే “sudo apt-get install gparted” అన్న కమాండ్ను వాడి install(351KB) చేసుకోవచ్చు. మీరు డిలీట్ చేయకుండా ఆ పార్టిషన్ని partition editorలో ‘Format to’ అన్న లిస్టులో మీకు కావలసిన format ఎంచుకోవటం మంచిది, లేదా ఆ డ్రైవ్ లో ఉన్న కంటెంటునంతా డిలీట్ చేసి ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవటం వల్ల ఏ ప్రమాదమూ రాదు…….

 6. సాయి ప్రవీణ్ Says:

  మీరు నాకు ఈ‌ విషయం ఒకటిన్నర సంవత్సరముల మునపే చెప్పారు. నాకు తెలిసి, లినక్స్ వాడేవారు నన్ను చాలామంది ఇదే విషయం గురించి చాలాసార్లు అడిగారు. ఇప్పుడు మీరు ఈ టపాను రాసి మా అందరికి మేలు చేసినవారైనారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: