లినక్స్ యొక్క ఫలాలు…

ఇది వరకే ఇక్కడ లినక్స్ యొక్క్ ప్రయోజనాలను గూర్చి వ్రాసాను. ఇప్పుడు మరి కొంత వివరముగా వ్రాస్తున్నాను.

లినక్స్కు చాలా అడ్వాంటేజస్ ఉన్నాయి. ఇందుకు ఒకానొక కారణం, ఇది UNIX నుండి ఆవిర్భవించినందువలన(మొదటిది ఈ కోవకు చెందినది కాదనుకోండి).

1. లినక్స్ వాడేవారికి స్వేచ్ఛ ఉంటుంది :

లినక్స్ కోసమని ఒక్క రూపాయి కూడా కర్చు చేయవలసిన అవసరం లేదు. ఉచితంగా అంతర్జాలం(Internet) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్ పని చేసే తీరును మార్చదలుచుకొంటే అందుకొరకు మార్చవలచసిన సోర్స్ కోడ్ లభిస్తుంది. అప్‌డేట్లు ఉచితం. వాడటం కొరకు రెజిస్ట్రేషన్ కానీ లైసెంసు డబ్బు కానీ చెల్లించవలసిన అవసరం లేదు.

ఇది ఎలా సాద్యం?

GNU Public Licence(GPL) వాడటం ద్వారా ఇది సాద్యపడుతుంది. ఇది ఏం చెబుతుందంటే, ఎవరైనా సరే ఈ కోడ్ను మార్చవచ్చు కానీ ఒక షరతు ఉంది, అది ఏమిటంటే, మీరు మార్చిన ఆ కోడ్ను ఎవరికైనా ఉచితంగా అందజేయాలి.

2. ఎలాంటి హార్డ్ వేర్ మీదనైనా పని చేసేలా దీన్ని మార్చుకోవచ్చు :

ఇక్కడ హార్డ్వేర్ అంటే వేర్వేరు కంప్యూటర్లని కాదు, కొత్తగా తయారు చేయబడే వస్తువేదైనా అని. అంటే కొత్త రకమైన మొబైళ్ళు లేదా ఎదైన ఎలెక్ట్రానిక్ డివైజ్ అవ్వచ్చు. ఏ ఆపరేటింగ్ సిస్టం వాడాలో అనుమానంగా ఉంటే, ఎదైనా కంపెనీకు సాఫ్ట్వేర్ తయారు చేయమని కోట్ల విలువ చేసే కాంట్రక్టు అప్పజెప్పవచ్చు లేక లినక్స్ కెర్నల్ ఉచితంగా డౌంలోడ్ చేసుకొని దాన్ని మన అవసరం కొద్దీ మార్చుకోవచ్చు.

3. లినక్స్ నిరంతరంగా పనిచేయటానికి రూపొందించబడినది :

అసలు రీబూట్ చేయకుండానే రోజులు లేదా సంవత్సరాల తరబడి పనిచేయగలిగే సామర్త్యం కలది లినక్స్, మీరు కంప్యూటర్ ఖాలోగా ఉన్నప్పుడు ఏదైనా పని చేయాలనుకొంటే దానిని మీ కంప్యూటర్ యొక్క పని తీరును బట్టి అవి ఆ సమయంలో పని చేసేలా నిర్ణయించవచ్చు. తద్వారా మీ హార్డ్వేర్ని ప్రయోజకరమైన రీతిలో ఉపయోగినచవచ్చు.

4. సెక్యూరిటీ మరియూ అనుకూలత :

లినక్స్ లో సెక్యూరిటీ, ధృడత్వం రుజువు చేయబడ్డ యునిక్స్ యొక్క సెక్యూరిటీని పోల్చి చేయబడినది. అలాగని కేవలం అంతర్జాలం నుంటి వచ్చే ఆటంకాలే కాదు, అదే నాణ్యతతో మిగిలిన పరిస్థితుల్లో కూడా అవే ధృడమైన ప్రనాళికలతో సెక్యూరిటి అందించగలదు. ఫైర్ వాల్ అంత బలంగా ఉంటుంది మీ సిస్టం. దీని గూర్చి ఇంకాస్త వివరముగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది.

5. లినక్స్ అనంత-ఆకారి :

2MBలతో నడిచే పాంటపుల నుంటీ పెటాబైట్ల సామర్థ్యంగల వందల నోడ్లున్న క్లస్టర్ల వరకూ…. కేవలం ప్యకేజీలను కొన్నింటిని తీసి మరికొన్నింటిని తగిలించటం, ఇక ఎక్కడైనా లినక్స్ సరిపోతుంది. పెద్ద పనులకోసం సూపర్ కంప్యూటర్లే అక్కర్లేదు, లినక్స్ లో ఉన్న చిన్న చిన్న సర్దుబాట్లు వాటిని మామూలు సామర్థ్యం గల కంప్యూటర్లలో కూడా సాద్యపడేలా చేస్తుంది. ఇక అతి చిన్న పనులు, ఎలాగంటే… ఒక ఎంబెడెడ్ ప్రాసెసర్ కోసం ఆపరేటింగ్ సిస్టం తయారు చేసేటంతటివి కూడా లినక్స్ చేయగలదు.

6. తప్పులు సరిదిద్దటానికి అతి తక్కువ సమయం తీసుకొనేది లినక్స్ మరియూ దాని అప్లికేషన్ లే :

లినక్స్, వేల మంది చేత తయారూ మరియూ పరిక్షించబడుతుంది కాబట్టి, తప్పులు మరియూ వాటిని సరిదిద్దే వ్యక్తులూ దొరకటం పోల్చటానికి వీల్లేనంత త్వరగా జరుగుతుంది. ఉదాహరణకు, ప్రపంచంలో ఎవరో ఎక్కడో తప్పు(Bug) కనుగొని ఇంకెక్కడో దాన్ని సరిదిద్దేయటం కొన్ని గంటల సమయంలోనే జరుగుతూ ఉంటుంది. దీని గూర్చి ఇంకాస్త వివరముగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది.

ఇంత మహత్యంగల లినక్స్ కు కొన్ని(చాలా చిన్నవి మరియూ తక్కువ) ఆక్షేపణలూ ఉన్నయి.