మేట్రిక్స్ సినిమా అర్థం అయ్యిందా?

కృత్రిమ మేదస్సు, దీన్నే Artificial Intelligence అని అంటారు. మొదట్లో మేట్రిక్స్ సినిమా చూసినప్పుడు స్టంట్ల కోసమే చూసాను. కానీ దాని సారాంశం తెలిసిన తరువాత, స్టంట్లు కేవలం మచ్చుకు మాత్రమే అనిపించింది.

Artificial Intelligenceకు ఇప్పుడున్న అర్థం దాని రూపొందించినప్పటి అర్థం వేర్వేరు. మీడియా దాని అర్థాన్ని మార్చేసింది. నేను ఈ టపాలో ప్రస్థుత అర్థాన్నే వాడాను.

అది క్రీ.శ 2199. ఆకాశమంతా కాలుష్యంతో నిండిపోయ్యున్నది. జీవకోటి మొత్తం నశించిపోయింది. అంతా చీకటి, ఒక్క సూర్య కిరణం కూడా భూమిని తాకటం లేదు. ఇక భూమ్మీది ఒక్క ఇందనపు చుక్క కూడా లేదు. మనుషులు భూమి ఉపరితలమునుండీ కిన్ని కిలోమీటర్ల లోతులో ఒక నగరంలో భయంతో బ్రతుకుతున్నారు. ఇంతకీ ఆ మహమ్మారి ఏమిటి? అదే Artificial Intelligence(కృత్రిమ మేదస్సు).

విద్యుత్తు లేకుండా కంప్యూటరే పని చేయదే, ఇక మనుషులు బయపడేంతటిది ఎలా పనిచేస్తోంది? సూర్యరస్మి లేకుంటే ఇక అది ఆగిపోతుందన్న బ్రమలోఆకాశన్ని కప్పేసారు మనుషులు, కాని అది ఆగలేదెందుకు? ఇదే మేట్రిక్స్ కు దారి తీసింది.

మనం అనుభవించే అనుభవాలన్నీ జ్ఞానేంద్రియాలు మన మెదడుకు పంపే సంకేతాలే. దీనిని వాడుకొని AI ఒక లోకన్ని తయారు చేసింది. అదే మేట్రిక్స్. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే తయారు చేసి మనుషులందరినీ బందించి వారి మెదడును ఆ లోకానికి జత చేస్తుంది. ఆ వ్యక్తి, ఆ లోకమే తను పుట్టి పెరిగే చోటని నమ్మేస్తాడు, అక్కడే జీవిస్తుంటాడు. ఇలా అతని శరీరం ఉత్పత్తి చేసే వేడినీ, మెదడులోని ఆలోచనలు ఉత్పత్తి చేసే విద్యుత్తునూ AI వాడుకొంటూ ఉంటుంది.

మేట్రిక్స్ లాగానే మనుషులు కూడా వారికి కావలసిన లోకాలను తయారు చేసుకొంటారు. వాటిలో శిక్షన పొందుతారు. చివరకి మేట్రిక్స్ లోకి హాక్ చేసి అందులో బ్రతుకుతున్న వారికి నిజాన్ని తెలియజేస్తూ ఉంటారు.

ఇక మీరు మరోసారి ఈ సినిమా చూసేటప్పుడు ఈ సారాంశాన్ని గుర్తు పెట్టుకొని చూడండి, మీక్కూడా స్టంట్లు మచ్చుకు మాత్రమే అనిపించవచ్చు.