వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవటానికి తొలి మెట్టు!!

ఈనాటి సమాజంలో Personality Development అన్నది తరచూ వాడే పదమే. కనీ దీని అర్థం కొందరికే తెలుసు. ఇలా ఎందుకన్నానంటే, కొంతమంది తల్లిదండ్రులు, వారి పిల్లలు “ఉద్యోగాలు సంపాదించటం కోసం Personality Development మరియూ Communication Skills అనే కోర్సులు ఏవో చేయాలి” అంటూ ఉండటం గమనించాను. నిజానికి Personality Development  అసలు అర్థం తెలుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ఈ టపా ఆ అర్థాన్ని గూర్చి వివరించటానికి కాదు, ఆ అర్థం తెలిసిన వారి కోసం.

ఇక అసలు విషయానికి వస్తే, వ్యక్తిత్వ వికాసం గూర్చి చదవటం, వినటం ఇలా చాలానే చేస్తూ ఉంటాం. కానీ దాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చాలా తక్కువమంది చేస్తారు. Personality Development పై వ్యాసాలు ఏవైనా చదివినప్పుడు, “అవును, ఇలా చేస్తే మనకు చాలా మంచి జెరుగుతుంది కదా. ఇకేం రేపట్నుంచి ఈ పనిలో ఉంటాను” అని అనుకొంటాం. కానీ నిజానికి మనం చేసేది అది కాదు.

మోదటి తప్పు ఏంటంటే, “రేపట్నుంచి” చేద్దామనుకోవటం. నిద్ర లేయగానే ఆ రోజు మామూలుగా చేయవలసిన పనులను గూర్చి ఆలోచిస్తామేకానీ నిన్న చదివినది గుర్తుకుండదు. మళ్ళీ వారం పది రోజులకు గుర్తుకొస్తుంది, అప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. ఈ వారం పది రోజుల్లో గుర్తుకు వచ్చినా వాయిదా వేయటం జరుగుతుంది.

ఇలా చేయటం వలన, మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది. మరో సారి ఈ నమ్మకాన్ని వెనక్కు తెచ్చుకోవటం చాలా కష్టం, ఈలోగా చాలా సమయం మరియూ అవకాశాలనూ కోల్పోతాం. అనుకున్నది సాధించాలి, హాయిగా బ్రతకాలి అన్న జీవిత కాలం చూస్తూ చూస్తూ చేజారి పోతుంది. అందుకే, ఇంత వరకూ వృదా చేసింది చాలు, ఇకనైనా చిన్న చిన్న గెలుపుల్లోని ఆనందాలను రుచి చూడటానికి నడుం బిగిద్దాం. ఇవే సుఖమైన జీవితానికి పునాదులు, డబ్బు కాదు, హోదా కాదు, మరేవీ కావు, ఇవి మాత్రమే.

మనఃశాంతి లభించేది కేవళం ఆనందం వలనే……

ఎలా చేయలి అన్న విషయానికి వస్తే…

1. ఈ రోజు చేయవలసిన ప్రతి పనినీ ఒక చీటీలో వ్రాసుకోవటం, ఒక్కదాన్ని కూడా వదలకుండా చేసేయటం. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకండి, ఏ ఒక్కటి కూడా. అలాంటివి ఏవైనా ఉంటే, మీ చీటీలో వ్రాయకండి, పట్టుదల ఉంటే ఈ పరిసస్థితి రాదు.

2. కలలు కనాలి, కలల పట్టీని తయారు చేసుకోవాలి. దీన్ని తయారు చేసే సమయంలో హద్దులను గూర్చి అలోచించరాదు, అంటే డబ్బూ సమయం మనకు కావలసినంత ఉన్నయి అనుకోవాలి. ఒక్కో కలనీ ఎలా నిజం చేసుకోవాలన్న ప్రక్రియను నిర్ణయించుకోవాలి. ఆ కలల్ని, వాటికి పట్టే సమయాన్ని బట్టీ వర్గీకరించుకోవాలి.

ఈ కలల్ని సాధించటానికి నమ్మకాన్ని కోల్పోరాదు, చిన్న చిన్న కలల్ని నిజం చేసుకొంటూ వస్తే ఈ నమ్మకం దాంతటదే వస్తుంది.

3. ఈ ప్రక్రియను ఎప్పుడూ ఆపకండి. దీన్ని పాటించటానికి డబ్బు, వయసు ఆటంకాలు ఏ మాత్రమూ కావు.

ఏ పనినైనా పూర్తి చేయాలంటే, వాయుదా వేయకుండా, తొలి అడుగు గమ్యం వైపు వేస్తే చాలు, సగం దూరం చేరినట్టే….. వదన్నా గమ్యం చేరేస్తానన్న నమ్మకం వస్తుంది, చేరుతాము కూడా…..

అందుకే మీ జీవితం కోసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించే వైపు ఇప్పుడే వేయండి మీ తొలి అడుగు.

All the Best!!