మైక్రోసాఫ్ట్ వారి అత్యాధునిక ‘కంట్రోలర్’ త్వరలో విడుదల!

XBOX – 360 ఈ పేరు చాలా మందే వినే ఉంటారు, మైక్రోసాఫ్ట్ వారు 2006లో ప్రవేశ పెట్టిన వీడియో గేం ఇది. Play Station – 3, ఇది Sony వారు ప్రవేశ పెట్టినది. వీటి రెండింటికీ పోటీగా Nintendo వారి Wii వచ్చింది. XBOX మరియూ PlayStationలు వైర్ లెస్స్ joystickలతో సరిపెట్టుకొన్నాయి. కానీ Wii మాత్రం MotionDetection Controller ద్వారా చేతిలోటి రిమోట్ యొక్క కదలికలను అధారంగా తీసుకొని పనిచేస్తుంది.

ఇప్పుడు Microsoft వారు పది అడుగులు ముందుకేసిందని చెప్పవచ్చు, రహస్యంగా పేటేంట్లు తీసుకొనేటప్పుడు(పేటెంట్లు రహస్యంగా తీసుకోకపోతే వ్యాపారం దెబ్బ తింటుంది) అంత అనుమానపూరితంగా కనపడలేదు. కానీ సంచలనాత్మక టెక్నాలజీతో ముందుకు రాగానే కాంపెటీటర్స్ బయపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు పెట్టిన పేరే Natal. దీనిని వాడుకొని తయారు చేసే వీడియో గేం పరికరాని పేరు ఇంకా తెలియవలసి ఉంది.

ఇంతకూ అంత సంచలనాత్మకమైన విషయం ఏమిటంటే, దీనికి కంట్రోలర్ ఉండదు!! ఆటగాడి శరీరం యొక్క కదలికలతో, మాటల సాయంతో(voice commands) అడాలి. క్రింద వీడియో చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇప్పటికే ఈ విషయం తెలుసుకొని XBOX-360 కొందామనుకున్న వాళ్ళు దీనికోసం వేచి ఉండటం వల్ల XBOX అమ్మకాలు తగ్గి పోయాయి, అందుకే వీలైనంత త్వరగా ఈ పరికరాన్ని విడుదల చేయటం అవసరం.

ఇక వీడియో గేంలు కూడా వ్యాయామం చేయిస్తే, అరోగ్యం మెరుగు పడుతుంది. XBOXకు భిన్నంగా, కేవలం కుర్రాల్లకే కాక మిగిలిన వర్గాలను కూడా ఆకట్టుకోగలుగుతుందంటున్నారు. కానీ మెత్తటి సోఫాలో కూర్చొని ఆడాలనుకున్నవారికి సరిపోదేమో??

ఈ టెక్నాలజీ కేవళం ఆటలకే కాక మిగిలిన అవసరాలనూ తీర్చగలిగేటట్టు వస్తే బాగున్ను, ఏం చేస్తాం MicroSoft వారు పేటెంట్లు తీసుకొనేశారు. కేసులు వేసి గెలవటానికి సమయం పడుతుంది.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు to “మైక్రోసాఫ్ట్ వారి అత్యాధునిక ‘కంట్రోలర్’ త్వరలో విడుదల!”

 1. vijayamadhavareddy Says:

  నాకు సరిగా గుర్తు లేదు కానీ ఈ టెక్నాలజీ ముందు ఎక్కడో విన్నట్లు గుర్తు.

 2. saipraveen Says:

  ఇటువంటి గేంలు ఆడుకోడానికి చాలా బాగుంటాయి. కానీ ఏం లాభం, లినక్స్ లో మనము ఇటువంటి గేంలు ఆడుకోలేము కదా.

  • Gavesh Says:

   @saipraveen మీరు అన్నదాంట్లో వస్తవం కొంత ఉంది కానీ, ఓపెన్ సోర్సు గేంలు ఇందులో ఆడే అవకాశం ఉంటుంది. కేవలం అందులోటి ఆపరేటింగ్ సిస్తమ్ను మనం చూడలేం అంతే!!

 3. Sarath 'Kaalam' Says:

  నైంటిండో వారి వియ్ కూడా కొంత శారీరక శ్రమ కలిగిస్తుంది. పిల్లలు అది తెచ్చుకున్నారు కానీ నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు.

 4. chavakiran Says:

  కూల్

  నేను దీన్ని చూళ్లేదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: