ఓపెన్ సోర్సు మరియూ లినక్స్ ఎందుకు సురక్షితమైనవి!

ఎవరైనా కోడ్ను చూడగలిగినపుడు, మార్చగలిగినపుడు, అందులో చాలా దొంగదార్లు(backdoors & loopholes) ఉంటాయి కదా? మరి ఇది సురక్షితమైనది కాదు కదా?

ఈ ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం ఇవాలంటే, “పై ప్రశ్న అపోహ మాత్రమే” అని చెప్పవచ్చు. ఉదాహరణకు పాస్వర్డ్  సెట్ చేసుకోవటం అందరికీ తెలిసినదే, కానీ పాస్వర్డ్ తెలియకుండా వేరొకరి కంప్యూటర్లోకి ప్రవేశించలేం.

ఒక సైంసు శిర్షికలో ఏదైనా ఆర్టికల్ అచ్చు వేయాలంటే, దాన్ని ఎడిటర్లు సరి చూసి ఆమోదిస్తేనే ప్రచురించబడుతుంది. అలాగే ఎవరైనా మార్చిన కోడ్ను ఒపెన్ సోర్సు రిపాసిటరీలో చేర్చాలంటే, దన్ని కోర్ కమిటీ అమోదించాలి, అంతే కాకుండా ఈ సంధర్భములో కోర్ కమిటీ పరిశిలన చేయకమునుపే చాలా మంది కోడర్లు వారి అభిప్రాయాలను తెలుపుతారు. కావున ప్రమాదకరమైన కోడు చేర్చబడదు.

అంతే కాదు, తప్పిదాలను కనుగొని, సరిచేసే విదానం మరియూ ఇందుకొరకు పనిచేసే వారి ఆలోచనాతీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లినక్స్ యొక్క ఫలాలని చూడండి.

కోడ్లోని మరియూ సెక్యూరిటీ తప్పిదాలను ఎలా కనుగొంటారు ఎలా పరిష్కరిచబడుతాయి :

సాఫ్ట్వేర్ కంపెనీ( ఉదాహరణకు Microsoft), వారు వ్రాసిన ఒక ప్రోగ్రాంను పరిక్షించటనికి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులను నియమిస్తుంది. వారు వారి పరిమితిలో ఉన్న పరిసరాలలో దాన్ని పరిక్షిస్తారు, చాలా వరకు సాఫ్ట్వేర్ల ద్వారా పరిక్షిస్తారు. ఒక వేళ  సాఫ్ట్వేర్ను అమ్మిన తరువాత తప్పిదాలను కనుగొన్నటైతే, కొన్ని సమయాల్లో దాన్ని బయటపెడితే ఎక్కడ అమ్మకాలు దెబ్బతింటాయో అని వాటిని దాచి ఉంచి, తరువాతి వర్షన్ విడుదల చేసే వరకూ, దాని పరిష్కారాన్ని అందించకపోవచ్చు.

కానీ అందుకు భిన్నంగా ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్లను వేలమంది, కొన్ని సమయాల్లో లక్షలమంది డౌంలోడ్ చేసుకొంటారు, ఎవరి పరిసరాలు వారివి, వారిలో ఎవరైనా వారు కనుగొన్న తప్పిదాన్ని గూర్చి పేర్కొంటే, అది సవరించబడుతుంది( కొన్ని సమయాల్లో కొన్ని గంటలలోనే పరిష్కరించబడుతుంది). పరిష్కరించిన మరుక్షనమే ఆ సెక్యూరిటీ అప్డేటు లభిస్తుంది.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు to “ఓపెన్ సోర్సు మరియూ లినక్స్ ఎందుకు సురక్షితమైనవి!”

  1. vijayamadhavareddy Says:

    ఈ విషయం మీద నేను బ్లాగుదాము అనుకుంటున్నాను. ఇంతలో మీరు రాసేసారు. సూపర్ ….. బాగా వ్రాసారు.

  2. నల్లమోతు శ్రీధర్ Says:

    చక్కని పోస్ట్ చేశారు. ధన్యవాదాలు.

  3. Gavesh Says:

    అభిప్ర్యాలు తెలిపినందుకు కృతజ్ఞతలు!!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: