ఒక్క MLA ఏమి చేయ”గలడు”??

జేపీ కూకట్ పల్లిలో గెలిచాడు, కొత్త రాజకీయానికి పునాది ఏర్పడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది?

విలేఖరి : మీ ముందున్న ప్రదాన లక్షం ఏమిటి?

జే.పీ : మూడు ఉన్నాయి, అవి

1. చట్ట సభల[Assembly, Parliament] పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని పెంచటం.

2. ప్రజల సమస్యలను తీర్చటానికి చట్ట సభలను వేదికగా చేసుకోవటం.

3. లోక్ సత్తా మ్యానిఫెస్టోలో ఉన్న 50 గ్యారెంటీలను అమలుపరిచే ప్రయత్నం చేయటం.

ఈ టపాలో, లోక్ సత్తా ప్రవేశ పెట్టిన 50 గ్యారెంటీలలో ఎవేవి జేపీ ఒక్కడే(పార్టీ అధికారంలో లెకుండానే) సాధించగలదు అన్న దాని పై నా విష్లేషన వ్రాస్తునాను.

మనలో కొందరికే మ్యానిఫెస్టో చదివే అవకాశం లేదా ఒపికా ఉండకపొయ్యుండచ్చు. 50 గ్యారెంటీలను విపులంగా వివరించిన మ్యానిఫెస్టో ఇక్కడ లభిస్తుంది.

20 గ్యారెంటీలను ఒక్కడిగానే మన MLA, తాను ఎంపికైన నియోజిక వర్గంలో చేయగలడని నా విష్లేషన.

ఏవేవి సాధించగలరనేవాటిని మూడు వర్గాల్లోకి విభజించాను.

1. పూర్తిగా సాధించగలిగేవి.

2. పోరాడి సులువుగా సాధించగలిగేవి.

3. కష్టం మీద సాధించగలిగేవి.

కొన్ని గ్యారెంటీలు గ్రామలకు ప్రత్యేకించినవి కావున వీటిలో కొన్ని(అగ్రో క్లీనిక్కులు లంటివి) కూకట్ పల్లీలో అమలుపరిచవలసిన అవసరం ఉండదు, కొన్ని(రోడ్లు) గ్రామాలకే కాకుండా పట్టణాలకు కూడా అవసరమయ్యేవి ఉన్నయి.

1. పూర్తిగా సాధించగలిగేవి :

మ్యానిఫెస్టోలో ఇవి 6,7,9,10,12,15,21,35,36,37,42,49వ గ్యారెంటీలు.

6. గ్రామాలకి త్రాగునీరు – ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుధ్ది చేయబడిన త్రాగునీరు.

7. నీటి సమస్యలకి జల రక్ష – భూగర్భ కాలుష్యం, నీటిలో అధికంగా ఫ్లోరైడు, ఉప్పు నీరు వంటి సమస్యలను రివర్స్ ఆస్మాసిస్/డి-మినరలైజేషన్ ప్లాంట్ల ద్వారా అత్యున్నత ప్రమాణాలతో త్రాగునీటిని అందించటం.

9. భహిరంగ మలవిసర్జన నిషేదం.

10. గ్రామ రహదారి – అంటే ఇక్కడ కూకట్పల్లీ రోడ్లు.

12. పట్టణాలు, నగరాలలో మౌలిక వసతులు.

15. భద్రతకి భరోసా – భూకబ్జాలు, దోపిడీలు, చోరీలు, కిడ్నాపింగులు సత్వరమే అరికట్టడం.

21. డబ్బు లేకపోయినా ఇక ఎవరి చదువూ ఆగదు – ఇప్పటికే అమలులో ఉందనుకోండి.

35. ప్రైవేటు మద్యం షాపుల రద్దు.

36. బెల్టు తీస్తాం – బీదల వాడల్లో మద్యం అమ్మకాన్ని నిషేదించటం.

37. బహిరంగ మద్యపానం పై వేటు.

42. పారదర్శకత, జవాబుదారీ తనం – పరిపాలనలో అన్ని స్థాయిలలో.

49. ఓటరు జాబితా ప్రక్షాళన – అర్హులైన అందరూ నమోదయ్యేందుకు ఏర్పాట్లు.

2. పోరాడి సులువుగా సాధించగలిగేవి :

మ్యానిఫెస్టోలో ఇవి 4,8,19,20,39వ గ్యారెంటీలు.

4. పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం – విద్య, అరోగ్యం, పౌర సరఫరాలు, నీటి పారుదల ఇలాంటి కీలక రంగాల్లో ప్రజలే ఎన్నుకున్న సభ్యులు.

8. గ్రామ దీపం – 24 గంటల నాన్యమైన కరెంటు. కొంచెం పోరాడవలసిన విషయమే..

19. ప్రతి స్కూలుకీ ఆధునిక వసతులు – కంప్యూటర్లు ఇంటర్నెట్ కోసమైతే పోరాడాల్సి రావచ్చు.

20. ఉపాధ్యాయులకు ఇక కీలక స్థానం – టీచర్లకి విద్యావ్యవస్థల్లో, పాఠశాల యాజమాన్యంలో భాగస్వామ్యాన్ని ఇవ్వటం.

39. ప్రజాసేవకే పోలీసు వ్యవస్థ – రాజకీయ జోక్యం లేకుండా, ఒత్తిళ్ళకి అవకాశం లేకుండా, స్వతంత్ర ప్రతిపత్తి గల నేర పరిశోధనా వ్యవస్థ ఏర్పాటు.

3. కష్టం మీద సాధించగలిగేవి :

మ్యానిఫెస్టోలో ఇవి 18,29,40వ గ్యారెంటీలు.

18. ప్రభుత్వ – ప్రైవేటు విద్యలు ఇక పై సమానం.

29. ప్రతి ఒక్కరూ ఎటువంటి జబ్బుకైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులలోనైనా ఉచితంగా చికిత్స పొందగలిగే అవకాశం.

40. సత్వర న్యాయం – 90రోజుల్లో తీర్పు ఇప్పించటం.

ఇవన్నీ అధికారంలో లేకుండానే!!! ఇక అధికారంలోకి వస్తే???

మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయగలరు……….

8 స్పందనలు to “ఒక్క MLA ఏమి చేయ”గలడు”??”

  1. రామ Says:

    దీనికి సమాధానం కాలమే చెబుతుంది. కానీ, ఆయన ప్రయత్న లోపం లేకుండా తప్పక పని చేస్తారని నా నమ్మకం. ఆయనకీ కూడా తెలుసు, ఇది తరవాతి elections లో ఓటర్లని ప్రభావితం చెయ్యగలిగే అవకాశం అనీ, ఆయన కుకట్పల్లి లో వ్యవహరించబోయే తీరు లోక్సత్తా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని. విజయోస్తు.

  2. Gavesh Says:

    @రామ – మీరన్నది నిజమే, జేపీ దూర దృష్టి కలవారు. నేనెప్పుడు ఆయన, పలానా ప్రశ్న అడిగితే ఏం సమాధానం ఇస్తారో అనుకొన్న ప్రతిసారీ, ఆ ప్రశ్న ఎవరో ఒకరు అడిగుండటం జేపీ దానికి సరైన జవాబివ్వటం జరిగి పోయుంటాయి.

  3. hanu Says:

    Yes we have to wait and see what JP does it, how much successful he is going to be. If he is successful then people trust him and vote for Lok Satta. People gave him the good opportunity and it’s his turn to prove. I wish JP all the luck.

  4. Gavesh Says:

    @Sreenivas – మీరడిగిన ప్రశ్నలన్నీ అసెంబ్లీలో ఎవరో ఒకరు అడగక మానరు. అప్పుడాయన ఇచ్చే సమాధానాల మీద ఆధారపడి ఉంది. నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తాను. UKలో మరియూ Manchesterలో ఉన్నవారికి ఈ విషయాన్ని పరిగనంలోకి తీసుకోమనండి. మీరడిగిన విష్లేషకుల మాట సంగతికి సమాధానం http://www.youtube.com/watch?v=Y02UIqPE4-8. ఈ పార్టీ ప్రజలది కాబట్టి ఇందులోటి నిజాలన్నీ మనం తెలుకోవలసిన అవసరం ఉంది. మీరు చెప్పిన వాటికి ఏదైనా proof(youtube వీడియో లాంటివి) ఉంటే తెలుపగలరు. మీరు ఎందుకనో సంకోచిస్తున్నట్టు తెలుస్తోంది.(URL మరియూ e-mail) సరైనవి ఇవ్వలేదు, అందుకనే ఇలా అంటున్నాను. తప్పుగా అనుకోకండి.

  5. Sreenivas Says:

    Gavesh Garu,

    I am afraid that these allegations will be unproved even in assembly because the main parties like Congress/TDP/PRP doesn’t see anything threat coming for at least coming 10 more years or so.. Loksattha has got 1.5% Vote % in 2009 Elections which is almost negligible and the main parties i think doesn’t care for proving JP irregularities or whatever it may be. Coming to the fact that, JP has given the Urbane Seats (where Loksattha is considered to have marginal affect) to his own caste. But sadly i don’t have any list with me, IF any Loksattha fans provide this and prove me wrong i would be happy. And also the fact that Enugu Rama Rao, (LS Uppal Candidate) was caught distributing money, The fact that 20 LS candidates did not provide PAN card details, and some of them has provided false details (0 assets and 0 funds) ). The fact that we have 10+ news channels and LS ads are seen at least 2-3 times per hour in all of them and you can estimate the money involved, but nothing has been furnished in the parties funds usage. With all these irregularities I find Loksattha no different from traditional parties. The fact that many youth look for change and hope and Loksattha was successful to pretend that they are for change. One thing i can say is Whenever JP/Loksattha has become a formidable force then automatically the opposition parties would track all the loopholes and the only time where everyone would know about JP.

    Looking forward for that DAY.

    • Gavesh Says:

      మీరన్నవి నిజాలో కావో తెలియదుకానీ, లోక్ సత్తా జే.పీది కాదు(బయట అనుకొంటున్నారంతే), పార్టీ ప్రశిడెంటు ఎవరుండాలనేది వోటింగ్ పెట్టారు, JPకి నేనూ వోటు వేసాను. ఒక కాంస్టుయెంసీలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అన్నదానికి పోటీ ఉంటే వోటింగ్ ద్వారా నిర్నయిస్తారు(ఈ వీడియో చూడండి http://www.youtube.com/watch?v=uZI21jLLZ-Q), పోటీ లేకుంటే(ఈ వీడియో చూడండి http://www.youtube.com/watch?v=xEp82L6yDWA) ఏకగ్రీవంగా టికెట్టు ఇస్తారు.PAN details ఈ ముందు video చూస్తేనే అర్థమౌతుంది, నాకు తెలిసిన ఏ(99%) house-wifeకూ PAN కార్డు లేదు, ఇక assets funds కత మీరే ఊహించండి. కావున పార్టీ తరఫున నిలబడేవారిని ఇస్టమొచ్చినట్టు టికెట్లివ్వటానికి లేదని స్పస్టమౌతొంది. మీరడిగిన లిస్టు సంపాదించటానికి పెద్ద ఇబ్బంది పడనవసరం లేదు ఇక్కడ(http://www.loksatta.org/cms/index.php?option=com_content&view=article&id=57&Itemid=130) లభిస్తుంది. కానీ caste విషయమై సీట్లిచ్చినట్టైతే నాకు కనిపించలేదు. మీరన్నట్టుగా వేరే పార్టీలకు లోక్ సత్తా లొసుగులు(ఏవైనా ఉంటే) పట్టించుకోవేమో కానీ మీడియాకి అంతకన్నా పెద్ద విషయం ఇంకొకటి దొరకదు, వాళ్ళైనా దాన్ని బయటపెడతారు. @”Looking forward for that DAY” – ఈ శైలి చూస్తుంటే మీరు లోక్ సత్తాను oppose చేయటానికే మాట్లాడుతున్నట్టుంది. ఇక్కడి మామూలు కుర్రాడు ఏదో సినిమాలూ మీడియా వారు వాడే శైలిని చూసి రాజకీయాలను entertainmentగా తీసుకున్నా దానికి అర్థం ఉంది. UKలో ఉన్న మీరు కూడానా?? ఒకవేళ JP తప్పైతే IAS వదిలేవాడే కాదు, 2lakhs ఎకరాలు సాగు చేయించకుండా, మామూలుగా పోతేపోనీలే అని ఉండేవాడేమో. బయటకొచ్చాక తప్పుదారి పట్టాడా అనుకొంటే, అల్లంటి సంగటనలూ జెరగలేదు. లోక్ సత్తా ప్రచారమైనా దుష్ప్రచారమైనా నోటి నుండీ నోటికి వెల్లిందే తప్ప TV ads వల్ల వరిగిందేమీ పెద్దగా లేదు. 1.5% వోట్లే అన్నదానికి నా సమాధానం(http://news.loksatta.org/2009/05/only-10-of-supporters-votes-polled.html).
      ఇంకా మీకేమైనా సందేహాలుంటే ఇది చూడండి(http://www.loksatta.org/cms/index.php?option=com_content&view=article&id=107&Itemid=109). విమర్శలుంటేనే పేరు త్వరగా పైకి వస్తుంది. మనకొక స్వచ్చంద వేదిక దొరికింది, ఒకవేళ మీరన్నటుగా అందులో తప్పులుంటే మనమే సరిదిద్దాలి లేదా అందుకు కనీస ప్రయత్నం చేయాలి. ఇందుకు ఫ్యాంస్ అయ్యుండనవసరం లేదు, ఈ పార్టీ నిర్వహించే కర్యక్రమాలలో పాల్గొనటమో లేక అభ్యర్థి స్థానానికి పోటీ ఉన్నప్పుడు వోటు(e-mail ద్వారా కూడా చేయవచ్చు) వేయటమో చేస్తే చాలు. దేశసేవ చేయటానికి మిలిటరీలో చేరి ప్రాణాలు అర్పించటమో లేక ఉద్యోగమొదిలి సంగసేవో చేయనవసరం లేదు, ఇలాంటి సందర్భాలలో “భలే చెప్పుకొచ్చావులే” అనో లేక “మనకెందుకులే” అనో అనుకోకుండా మనకు వీలైన సాయం చేస్తే చాలు, దేశ సేవ చేసినట్టే. ధన్యవాదాలు శ్రినివాస్ గారు….

  6. Sreenivas Says:

    Gavesh,

    Meeru mana party, manam bagu cheyyali antunnaru, Praja vedhika ani LS nu aakasaniki etthesthunnaru. I have apprehensions on LS before accepting it as ‘Praja Samya porata Vedhika’.

    1) Caste politics cheyyamu anna JP, a) Urbane lo 70% thana caste vallake ela icchadu (Thappu authe List ivvandi) 2) BC united Front tho endhuku chethulu kaliparu? (http://news.loksatta.org/2009/03/lok-satta-party-and-bc-front-join-hands.html)
    2) JP once said about transparency government and ruling? Pan Card details provide cheyyani varu LS lo 20 mandhi dhaaka unnaru. Sare House wife kani evaranna kani ‘0’ Assets ante namocchu, Bank lo ‘0’ funds untaya? idhi sadyama? Assala Pan card leni contestants ku seats icchi ela transparency govt teesukosthadu cheppandi?
    3) JP thana asthi 9 Crs ani cheppadu, oka collector jeetham entha? entha sampadinchagaladu? vere vyaparalu unte, avi endhuku Election commission ku submit chesina documents lo levvu? JP crs lo Ads kosam karchupettadu, mari LS website lo yearly funds karchupettinavi 9Lakhs emo chepparu, idhi abbadhame kadha? Antha dabbu LS ku ekkadanundi fund vasthundi?
    4) Anni Maha Sabhalu authe Velli PRP sabhane clean cheyyatam entha varaku correct(Malli adhi Photo pose kosame,)?
    5) Party kosam Prajala kosam emi cheyyani variki seats ivvamu anna JP, edho constituency nundi nama matrapu contestant voting pettaru, mari Lavu Rattiah ee roju join authe party lo repu Malkajgiri MP ela iccharu?
    6) Criminal cases undakoodadhu ani start chesina LS, Lavu ratthaiah paina criminal case pending undhi.(http://www.deccanchronicle.com/hyderabad/choose-your-neta:-criminals,-crorepatis,-they-are-all-there-005)

    ila cheppukunta pothe chala untai, LS paina naku nammakam ledhu, so mana ‘Vedhika’ ani nenu anukovatam ledhu, evaraina nenu adigina paina questions ku nenu satisfy ayye vidanga answer chesthe nammuthanemo.

    Meeru kooda ‘Mana Vedika’ ani ‘Manam edho cheyyali’ ‘mana Party’ ani andarini kalipi blog lo rayatam enthavaraku sababu?😀


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: