లినక్స్ యొక్క ప్రతికూలతలు….!

1. లినక్స్ డిస్ట్రిబ్యూషన్ లు మరీ ఎక్కువగా ఉన్నాయి :

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నా డిస్ట్రిబ్యూషన్. నేను చేసినదానికి ఒక ప్రత్యేకత ఉంది, ఇది విండోస్ వాడే వారికి సరిపోయేలా రూపొందించినది. ఇలా ఏ ఎడిషన్ యొక్క ప్రత్యేకత దానికి ఉంది. ఇందులో ఉన్న ప్రతికూలత ఏమిటంటే, కొత్తగా వీటన్నిటినీ చూసినవారెవరైనా నివ్వెరపోయే అవకశం ఉంది. కానీ ఏ నైపున్యతా లేని వారు కూడా వీటిలో వారికి సరిపడేదాన్ని ఎంచుకోవచ్చు. ఈ సమస్య ఎందుకొచ్చిందంటే, లినక్స్ కు ఉన్న స్వేచ్చ అలాంటిది…

ఏ లినక్స్ వాడుకరినైనా ఏ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుందని ప్రత్యేకంగా అడిగితే, వారు సామాన్యంగా ఇచ్చే జవాబు, వారు వాడుతున్న డిస్ట్రిబ్యూషన్ పేరే. మరి ఎది వాడాలి? ఎక్కువగా దీనిగూర్చి అలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే, అన్నింటిలోనూ వాడే మూలాధారమైన ప్యాకేజీలు దాదాపు ఒకటే. కాకపోతే వాటితోపాటుగా వచ్చే మరిన్ని third-party సాఫ్ట్వేర్లు వాటి వాడకాన్ని మార్చేస్తాయి.ఉదాహరణకు, TurboLinux చిన్నాచితకా కంపెనీలకు సరిపడుతుంది. సర్వర్ లకు Redhat, అలాగే Suse వర్క్ స్టేషంలకు. కానీ తేడా మాత్రం పైపైనే. ఇందుకు మార్గం వీలైనన్నింటిని పరిక్షించటమే, కానీ అందరికీ ఇంత సమయము ఉండదు. అందుకే గూగుల్ ఉందిగా, ‘ఏ లినక్స్ వాడటానికి మంచిది‘ అని వెతికితే చాలు విండోస్ లా కనిపించే మరియూ ఇంస్టాల్ చేయటానికి కావలసిన ఉపదేశాలతో లినక్స్ మీముందుంటుంది.;)

2. లినక్స్ కు అంత సులభంగా అలవాటు పడలేరు(ఒకప్పటి అపోహ) :

ఇది ఒకప్పటి కాలంలో నిజమైవుండచ్చు కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కానీ ఒక నిజం ఒప్పుకోవాల్సిందే, అదేంటంటే కోర్ సిస్టం వాడటం కష్టమే. కానీ ఇంతలోతుగా వాడల్సిన అవసరం మద్యతరహా వాడుకరులకు ఎప్పుడూ రాదు. కానీ అందుకు కూడా అవసరమైన డాక్యుమెంటేషన్ లలో వదిలివేయబడిన ఖాళీలు రోజు రోజూ నింపబడుతున్నాయి.

3. ఓపెన్ సోర్సును నమ్మవచ్చా? :

ఇంత ఉచితంగా లభించేది, నమ్మసఖ్యంగా ఉండగలదా? చాలా రోజుల పరిక్షల తరువాత దాదాపు ప్రతి లినక్స్ వాడుకరీ, లినక్స్  కేవలం విస్వసనీయమైనది మాత్రమే కాదు, వేగమైనదీ మరియూ మేలైనదీ అని అంటున్నారు. ఒకవేళ నమ్మసఖ్యమైనది కాకపోయ్యుంటే ఇంతకాలం మన్నేదీకాదు, ఇన్ని లక్షలమంది వాడుకరులూ ఉండెవారు కాదు.

ఇప్పుడు వాడుకరులు వారి కంప్యూటర్ మీద పూర్తి అధికారం కలిగి ఉంటున్నారు, వారికి ఏదైనా సందేహమొచ్చినా లేక తప్పు కనిపించినా లినక్స్ కమ్మ్యూనిటీతో చెప్పగలుగుతున్నారు, అంచేత రోజు రోజుకీ లినక్స్ మెరుగుపడుతూ వస్తోంది.

ఇది ఎప్పటికీ పూర్తికాని ప్రాజక్టు, అవును నిజమే, కానీ నిరంతరం మారుతున్న ఈ సమాజంలో ప్రతి రోజూ అవసరాలను బట్టీ మెరుగుపడుతూ వస్తోంది లినక్స్.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: