లినక్స్ కు భవిష్యత్తు ఉందా?

ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ యొక్క భావము చాలా సరళమైనది. ప్రోగ్రామర్లు కోడ్ను చదవగలిగి, మార్చగలిగి, ఇతరులకు పంచగలిగినప్పుడు, ఆ కోడ్ కచ్చితంగా మెరుగు పడుతుంది. ఒక వేళ కోడ్‌లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దటం కానీ కోడ్‌ని అలవాటు చేసుకోవటం కానీ, మిగిలిన ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే, అవి నత్త నడక నడుస్తాయనటం అతిశయోక్తి కాదు. ఇవి సాదారణమైన ఆపరేటింగ్ సిస్టంలకన్నా చాలా మంచి క్వాలిటీ కలిగివుంటాయి, ఎంచేతనంటే వీటిని చాలా మంది, వేర్వేరు స్థిథులలో పరిక్ష చేసి ఉంటారు, ఇలా చేయటం సాదారణంగా ఎంత పెద్ద కంపెనీలోనైనా ఎప్పటికీ వీలు పడదు. ఇది వ్యాపారవేత్తలకు తెలియచేయటం ఈ కమ్యూనిటీ యొక్క ఒకానొక ఉద్దేశం. ఇప్పుడిప్పుడే వారు మెల్లగా దీనిని గ్రహిస్తున్నారు.

గత 20 సంవత్సరాలుగా విద్యాసంస్థలు మరియూ నిపుణులు ఇదే సరైన దారిగా గుర్తించి దీనినే ఎంచుకొంటూ వస్తున్నారు. ఇంటెర్నెట్ లాంటి ఉపకరణాలు ఉంటే తప్ప వ్యాపారవేత్తలకు ఓపెన్ సోర్స్ లాభదాయకంగా మారదు. కేవలం విద్యాసంస్థలల్లో మరియూ కొందరు నిపుణులకు మాత్రమే పరిమితమైన స్థితి నుండి లినక్స్  బయటకు వచ్చి చాలా కాలమైంది. ప్రస్తుతం, కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే కాదు, అందుకు కావలసిన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చగలిగేలా, ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత అప్డేట్లూ, టెస్టింగ్ ప్రోగ్రాంలు ఇలా మరెన్నో అందిస్తున్నది. శెర వేగంతో మారుతున్న ప్రస్థుత ప్రపంచం యొక్క పోటీను ఆహ్వానించగల సత్తా దీనికి ఉంది.

కేవలం లినక్స్ మాత్రమే కాదు, ఓపెన్ సోర్స్ లో అంతే గుర్తింపు పొందిన మరొక ప్రొజెక్ట్  SAMBA. ఇది మైక్రో సాఫ్ట్ వాళ్ళు డెస్క్‌టాప్లకూ మరియూ ప్రింటర్లలో వాడే ప్రోటోకాల్లను రివర్స్ ఇంజినియరింగ్ చేసి తయారు చేయబడ్డది. ఇలాంటి గుర్తింపు పొందిన మరొక ప్రాజెక్ట్ ‘అప్యాచీ’. సాదారణ సర్వర్ సాఫ్ట్‌వేర్ల కన్నా ఎక్కువ వేగంగా మరియూ ఎక్కువ ఫీచర్లు కలది. ఒకే రోజులో లక్షలాది మంది విచ్చేస్తున్న, అప్యాచీ సర్వర్ సాయంతో నడపబడుతున్న వెబ్‌సైట్లు, ఎటువంటి అదికారిక సహాయం లేకనే ఎటువంటి ఇబ్బంది పడకుండా సేవలను అందిస్తూన్నాయి. ఓపెన్ ఆఫీస్ కూడా వీటిలో ఒకటి. యమ్.యెస్.ఆఫీస్కు దీటుగా వాడుకరులను ఆకట్టుకోగలది.

ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో పని చేసే వారు కనీసం 5 సంవత్రరాలు ఇందులో సేవలందించినవారే. స్వచ్చందంగా వచ్చిన వారు మరియూ ఇందులోని ఉద్యోగస్తులూ, మార్కెట్‌లో లినక్స్ యొక్క స్థన్నాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది వాడితే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, వాటన్నిటికీ జవాబులు వచ్చేలా, వచ్చిన ఆ జవాబుల యొక్క నణ్యతను సరిచూస్తూ ఉంటారు.

ఇక్కడ మరియూ ఇక్కడ మీరు విండొస్ నుండి లినక్స్కు మారటం ఎంత సులువో ఎందుకు అవసరమో గమనించవచ్చు. మరొక ఆపరేటింగ్ సిస్టంను కించపరచటం లినక్స్ ఉద్దెశం కాదు. కానీ ఆ అర్హత కేవలం లినక్స్ కు మాత్రమే ఉందని నా అభిప్రాయం.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “లినక్స్ కు భవిష్యత్తు ఉందా?”

 1. shivaspeaks Says:

  అందరం ఓపెన్‌సోర్స్ లాబాలను గుర్తించాలి . ముందు భవష్యత్ ఓపెన్‌సోర్స్ దే . నేనూ ఓపెన్‌సోర్స్ అభిమానినే.

 2. సూర్యుడు Says:

  ఓపెన్ సోర్స్ ఇంత గొప్పదని చెప్పి, దానికి భవిష్యత్తుందా అని అడుగుతున్నారంటే, దానిమీద మీకే నమ్మకం లేదనిపిస్తోంది 😉

  I am using Linux on my desktop for last 10 years without any issues. I believe “it is the future” 🙂

  ~సూర్యుడు 🙂

 3. gavesh Says:

  నాకు, భవిష్యత్తు లినక్స్ దే అని నమ్మకం ఉన్నా అలా చెప్పటం కొందరికి, గొప్పలు పోవటంలా అనిపించవచ్చని, నిర్ణయాన్ని పాఠకులకే వదిలేసాను…..:)
  మరి కర్ణాటకలో లినక్స్ పరిస్థితి ఎలా ఉంది? దీనిని ఒకసారి గమననించగలరు.

 4. రాజ మల్లేశ్వర్ కొల్లి Says:

  The topic “లినక్స్ కు భవిష్యత్తు ఉందా?” is a Year 2000 – 2001 discussion. It is already being used in several top industries ( financial, automobile, tele-comm, health & etc..,). So please don’t worry about Linux’s future.

  I think you should change heading as “లినక్స్ దే భవిష్యత్తు”. I know this statement is little exaggerated, but it is apt for your post..

  If you have time, Please see video of RH Linux commercial, which is my all time favorite.:-)
  http://unix-freak.blogspot.com/2006/03/truth-happens.html


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: