లినక్స్ వాడటం కష్టమా?

లినక్స్ వాడటం కష్టమా?
ఈ ప్రశ్నకు జవాబు మీరు అడిగే వ్యక్తిని బట్టి ఉంటుంది.
యూనిక్స్‌లో నైపుణ్యం కల వారిని అడిగితే, వాళ్ళు కష్టమేమీ కాదు అని సమాధానమిస్తారు. ఎందుకంటే లినక్సు, శక్తివంతమైన వాడుకరులకూ అలాగే ప్రోగ్రామర్లకూ సరిగ్గా సరిపడే ఆపరేటింగ్ సిస్టమ్, ఎందువలనంటే దీనిని తయారు చేసింది అలాంటివారే కనుక.

ఒక ప్రోగ్రామర్ కావాలనుకున్నవన్నీ ఇందులో ఉన్నాయి, కంపైలర్లు, లైబ్రరీలు, డెవ్‌లప్‌మెంట్ మరియూ డీబగ్గిన్గ్ టూళ్లు. సాధారణంగా వాడే  ప్రతి లినక్స్లో ఇవి ఉంటాయి. కావలసిన చోట, ఉదాహరణలూ మరియూ మ్యాన్యువళ్ళుతో వెంటనే అలవాటు పడేలా ఉన్నందువలన ఉనిక్స్ నుండి లినక్స్‌కు మారటం సర్వ సాదారణం.

ఒకవేళ మీకు వాడాలన్న సంకల్పం ఉంటే ఇది చూడండి.

లినక్స్ వచ్చిన మొదట్లో, దీనిని వాడటానికి నైపుణ్యత కలిగి ఉండటం తప్పనిసరిగా ఉండేది. అప్పట్లో లినక్స్ వాడేవాళ్ళు సిస్టంను మిగిలిన వాడు’కరు’ల కన్నా చక్కగా(పూర్తి స్థాయిలో) వాడికొగలిగేవారు. కానీ ఆ రోజుల్లో కొత్తగా లినక్స్ వాడాలనుకున్న వారికి ప్రోత్సాహం ఎక్కువగా లభించేది కాదు, ఏదైన సందేహం వ్యక్తం చేస్తే, డాక్యుమెంటేషన్ చదుకో అని చెప్పేవారు. ఆ డాక్యుమెంటేషన్ దొరకకో లేక దొరికినా అర్థం కాకనో కొత్త యూసర్స్ నిరాశ చెంది లినక్స్‌కు స్వస్తి చెప్పేవారు. ఇలాగైతే వాడుకరులు కరువైపోతారేమోనని అనుభవం లేని వారి కోసం మెరుగులు దిద్దాల్సిన అవసరముందని లినక్స్ వాడే కమ్యూనిటీ తెలుసుకోసాగింది.

అప్పుడే వచ్చిన రెడ్ హాట్, సుసే, మాండ్రివా లాంటి కంపనీలు చాలామంది ఒకేసారి డౌన్లోడ్ చేసుకోదగ్గట్టుగా రిపాసిటరీలు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లినక్స్ గురించి పూర్తిగా తెలుసుకొనే వీలు ఉంది, కానీ తెలుసుకోకుండానే మనకు కావలసిన పనులు దానిచేత చేయించుకోగల సులువైన పద్దతులూ ఉన్నయి.

పూర్వంలా కాకుండా, ఒక్క ‘కీ’ కూడా టైప్ చెయ్యాల్సిన పని లేకుండా మనకు కావలసిన అప్లికేషన్ తెరుచుకోవచ్చు. అంతే కాదు అనుబవమున్న వారికీ లేని వారికీ కూడా సులువుగా అర్థం అయ్యే రీతిలో ప్రస్తుత లినక్స్ ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు. దినంతటికీ కారణం ‘జి.యు.ఐ’ అదే గ్ర్యాఫికల్ యూసర్ ఇంటర్‌ఫేస్. సిస్టం ఎలా పని చేస్తుందో తెలుసుకోవటానికి అతి తక్కువ మొగ్గు చూపే డెస్క్టాప్ యుసర్లకు అనుగుణంగా చాలా అబివృద్దులు జెరుగుతున్నాయి. ఆపల్ మరియూ మైక్రో సాఫ్ట్ వారి ఇంటర్‌ఫేస్కు పోటీగా, అప్పుడప్పుడూ వాటిని అదిగమిస్తూ ఉంది ఇప్పటి లినక్స్ డెస్క్‌టాప్స్ మరియూ సర్వర్స్ యొక్క యూసర్ ఇంటర్‌ఫేస్. ఒక్క క్లిక్ తో అన్ని సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకో కలగటం, ఇలాంటివి మరెన్నో…….

కింద తెలిపిన వెబ్సైట్లలో మరింత లినక్స్ గురించి తెలుసుకొనే అవకాశముంది :

P.S: ఇది వరకే ఈ పోస్టును ప్రచురించాను, కానీ అప్పుడు కూడలిలో పిచ్చి అక్షరాలు వచ్చాయి, అందుకే మల్లీ ప్రచురించాను.

3 స్పందనలు to “లినక్స్ వాడటం కష్టమా?”

  1. ఆకాశరామన్న Says:

    you didn’t mentioned “ubuntu”,🙂 the linux flavor used by most. It just like windows, yet powerful like other linux flavors.

  2. gavesh Says:

    మీరు ఈ టపా గురించి ఎలా తెలుసుకొన్నారు? కూడలి నుండా లేక మరొక విదంగానా? ఎందుకంటే నేను వ్రాసిన ఈ చివరి టపా కూడలిలో తెలుగులో కనబడలేదు, ఏదో వింత భాషలో కనిపిస్తోంది. దయచేసి వివరాలు తెలుపగలరు. ధన్యవాదములు! మీరు అన్నట్టుగా ubuntu నిజంగా చాపా పాపులర్, నేను తయారు చేసిన ఈ స్పిన్ చాలా ఉపయోగపడుతుంది. వివరాలు http://gaveshedition.wordpress.comలో ఉన్నాయి. అలాగే నేను ఇదివరకూ వ్రాసిన ఈ టపా చూడండి. https://gavesh.wordpress.com/2009/05/04/linux-for-windows-addicts-2/


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: