విండోస్ లో తెలుగు బ్లాగులు చదవటం ఇబ్బందిగా ఉందా?

క్రింద తెలిపిన పద్దతిని పాటించండం వల్ల మంచి ఫలితం కనబడుతుంది.

Step 1 : ఈ zip ఫైల్ ను డౌంలోడ్ చేయండి. డౌంలోడ్ ఐన zip ఫైల్ ను unzip చెయ్యండి. వచ్చిన Pothana2000.ttf మరియూ vemana.ttf ఫైల్లను కాపీ చేసుకొని C:\Windows\Fontsలో పేస్ట్ చెయ్యండి.

Step 2 : డెస్క్ టాప్ మీద Rigth-Click చేసి Properties సెలెక్ట్ చేసుకోండి, వచ్చిన విండోలో Appearence ట్యాబులో Effects బటన్ను క్లిక్ చేయండి. “Use the following method to smooth edges of screen fonts” అన్నది “Standard” అని ఉంటుంది, దాన్ని “ClearType“కి మార్చండి. ఓకే చేసేయండి. క్రింద చూపిన బొమ్మ ఉపయోగపడుతుంది.

cleartype

Step 3 : బ్లాగు చదువుతున్నప్పుడు అక్షరాలను పెద్దవిగా చేయటానికి Ctrl మరియూ + నొక్కాలి చిన్నవిగా చేయటానికి Ctrl మరియూ - నొక్కాలి.లేదా మౌసు మద్య బటన్ను Ctrl పట్టుకొని స్క్రోల్ చేసినా సరిపోతుంది.

బ్రౌజరు Internet Explorer కన్నా Firefox ఐతే బాగుంటుంది.


ప్రత్యుత్తరమిమ్ము