కేవలం ఒక్క శాతం మంది మాత్రమే పళ్ళు సరిగ్గా శుబ్రపరుచుకొంటారు, మీరు వారిలో ఒకరా?

బ్రష్ చేయటానికి సరైన పద్దతి ఏది?

సరిగ్గా బ్రష్ చేయటానికి కేవలం రెండు నిమిషాలు పడుతుంది. కానీ చాలామంది ఈ కాస్త సమాయాన్ని కూడా కేటాయించరు. కావాలంటే మీరు బ్రష్ చేసే సమయాన్ని కొలిచి చూడండి. చిన్నపాటి మరియూ నెమ్మదైన కదలికలతో, చిగుళ్ళకూ అలాగే కష్టం మీద చేరగలిగే దవడ పళ్ళకూ మరింత ప్రాదాన్యత ఇస్తూ బ్రష్ చేయాలి.

బ్రష్షు మరియూ పేస్టు ఎలాంటివై ఉండాలి?

చాలామంది డెంటిస్టులు soft-bristles ఉన్న బ్రష్షుని వాడమని సలహా ఇస్తారు. చిన్నటి హెడ్(Bristles ఉన్న ప్రాంతం) ఐతే, కష్టంగా అందుకోవాల్సిన ప్రాంతాలకు కూడా చేరుకోగలదు. 2-3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి. ఒక వేళ అరుగుదల అంతకన్నా ముందే కనిపిస్తే అప్పుడే మార్చేయాలి.

నిజానికి పేస్టు వాడవలసిన అవసరం లేదు, కాకపోతే మనం అలవాటుపడిపోయాం కాబట్టి సోడాపొడీ ఉప్పూ యొక్క మిశ్రమం సరిపోయినా వాటిని వాడలేం. అందువలనే ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి, ఏలా వాడాలన్నది వ్రాస్తున్నాను.

కాల్షియంతో కూడినది (సాధారనంగా ఇలాంటివి తెల్లగా ఉంటాయి) వాడటంవల్ల పళ్ళకు రక్షణ ఉంటుంది. ఇలాంటి పేస్టును మొదటగా బ్రష్షు సాయంతో పంటి యొక్క నమిలే వైపు (పై పంటికి క్రింద, క్రింది పంటికి పై వైపు) రాయాలి.

పళ్ళ సందుల్లోకి బ్రష్షు బ్రిసల్స్ తో శుబ్రపరచాలి.

పైన చూపిన విదంగా….

1. పై పళ్ళ వెలుపలి వైపు అలాగే క్రింది పళ్ళ వెలుపలి వైపూ శుబ్రపరచండి.

2. పై పళ్ళ లోపలి వైపు అలాగే క్రింది పళ్ళ లోపలి వైపూ శుబ్రపరచండి.

3. దవడ పళ్ళను శుబ్రపరచండి.

4. శ్వాస ధుర్గందబరితంగా లేకుండా ఉండటానికి, నాలుకపై శుబ్రపరచటం మరువకండి. టంగ్ క్లీనర్ వాడటం మంచిది కాదు, ఎందువలనంటే, నాలుక మొద్దుబారిపోయి సులభంగా రుచులను గుర్తించలేదు, కావున బ్రష్ తో నాలుకను శుబ్రపరచండి.

ఇక్కడ స్వయంగా మీరే బ్రష్ చేయటం పరిక్షించవచ్చు.

చాలా రకముల టూత్ పేస్ట్ లలో 1000 p.p.mల నుండీ  1500 p.p.mల వరకూ ఫ్లోరైడ్ ఉంటుంది. మన రాష్ట్రంలో డెల్టా ప్రాంతాల్లో( నీటి పారుదల పుష్కలంగా ఉన్న కోస్తా ప్రాంతాలు ) తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో నీళ్ళల్లోనే ఫ్లోరైడ్ తగినంత ఉంటుంది. కొన్ని జిల్లాల్లో( అనంతపురం, నల్గొండ మొ॥) మరీ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ టూత్ పేస్టు ఫ్లోరోసిస్ వ్యాధిని అధికం చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లు ఇలాంటి పేస్టు మింగడం మరీ ప్రమాదం. కావున మీరు ఈసారి పేస్టు కొనేటప్పుడు ఫ్లోరైడు లేని  (Non-fluoridated) మరియూ కాల్షియం ఉన్న టూత్ పేస్టును చూసి కొనండి.

6 స్పందనలు to “కేవలం ఒక్క శాతం మంది మాత్రమే పళ్ళు సరిగ్గా శుబ్రపరుచుకొంటారు, మీరు వారిలో ఒకరా?”

  1. Bindu Says:

    ADA వాళ్ల లింక్ ఇది.
    http://www.ada.org/public/topics/cleaning_faq.asp
    మన వాళ్లు చేయనిది, ముఖ్యం అయ్యింది floss చేసుకోవటం. అదీ నిద్ర పోయే ముందు, భోజనం తర్వాత చాలా ముఖ్యం.
    genetical గా నేను గమనించింది ఏమిటి అంటే, మన వాళ్లకు పళ్లు contact, tight గా ఉంటాయ్యి, అందుకని floss మరీ ముఖ్యం.
    చిన్నప్పుడు, పళ్ల పొడి వాడటమో, లేక అలవాటో గాని, మన వాళ్లు brush, rough గా చేస్తూవుంటారు, ముఖ్యం గా canine(కోర దంతాల) దగ్గర, అందువల్ల gums పైకి పోయి, sensitivity ఎక్కువుగా వస్తూ ఉంటుంది.
    ఇంకోకటి, gums నుండి, రక్తం వస్తూ ఉంటే మాత్రం, వెంటనే వెళ్లి పళ్ల డాక్టర్ కు చూపించుకోండి. అవసరమయితే, వెంటనే, SCRP( scaling and root planning/ deep cleaning) చేయించుకోండి. మనవాళ్లకు ఉన్న ఇంకో అపోహ పళ్లు cleaning చేయించుకొంటే loose అవుతాయి అని. అది కేవలం అపోహ మాత్రమే.

  2. Bindu Says:

    General గా గట్టి గా పళ్ళు తోముతున్నంత మాత్రాన, చిగుళ్ల వెంబడి రక్తం రాదు. Most of the cases రక్తం మాత్రం gum disease వలన వస్తుంది. But for sure, Dentist, check చేసిన తర్వాత చెప్పగలరు.

    ఒకవేళ రక్తం వస్తుంటే, అదీ gum disease వలన వస్తుంటే, regular cleaning వలన పెద్దగా ఉపయోగం ఉండదు. Under the gums, cleaning చేయాల్సివస్తుంది, దానినే, deep cleaning అని కూడా అంటారు.
    gum problems ఉన్న stage ని బట్టి, ఒక్కోసారి, laser surgeries కూడా చేయాల్సి రావచ్చు.
    ఏది ఎమైన, మన వాళ్ళు neglect చేసే common, disease లలో gum disease ఒకటి అని చెప్పవచ్చు. నోటి దుర్వాసనకు ముఖ్యమైన కారణాలలో ఇది ఒకటి.

    ఈ మధ్యన, gum disease కు cardiovascular disease కు links కూడా prove చేయబడినాయి.
    gum disease మీద ADA వాళ్ల link.
    http://www.ada.org/prof/resources/topics/gum.asp


ప్రత్యుత్తరమిమ్ము