కొత్త ల్యాప్‌టాప్ కోనాలనుకుంటున్నారా?

లాప్‌టాపులను  ఇప్పుడు చాలా కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయి. కానీ మన అవసరాన్ని పరిమితిని  బట్టి కింద తెలిపిన వాటి నుండి ఒకటి మీరే ఎంచుకోవచ్చు.

  • డెబ్బై వేలకు పై చిలుకు పెట్టాలనుకుంటే ఆపల్ (APPLE) కొనొచ్చు..
  • యాభై నుండి డెబ్బై వేల వరకు ఐతే సోనీ(SONY)  వారు ప్రవేశపెట్టిన వయో (VAIO)  కొనవచ్చు
  • నలభై నుండి అరవై వేల వరకూ ఐతే డెల్ (DELL) మరియు హెచ్ పి (HP) వారు అందిస్తున్న లాప్ టాప్‌లు బాగుంటాయి.
  • కాంప్యాక్ మరియు డెల్ కంపెనీలు ముప్ఫై ఐదు వేల లో కూడా అందిస్తున్నాయి.

సారాంశం :
చాలా మందికి డెల్(DELL) ఉత్తమమైనది. ఇది ముప్పై వేల నుండి డెబ్భై వేల మధ్య వివిధ రకములలో లభిస్తుంది. కానీ మీ యొక్క పరిమితిని మరియు అవసరాన్ని బట్టి  పైన తెలిపిన వాటిలో ఏదైననూ కోనవచ్చు.

కాన్ఫిగరేషన్ :

  1. ర్యామ్ : తక్కువ లో తక్కువ అంటే 512MB, 2GB కన్నా ఎక్కువ సామాన్యంగా అవసరం ఉండదు.
  2. ప్రోసెసర్ : కోర్ 2 డ్యయో(Core2Duo) ఐనా లేక డ్యూయల్ కోర్(Dual Core) ఐనా క్లాక్ స్పీడ్(Clock Speed) 2GHz ఉండటం మంచిదే.
  3. గ్ర్యాఫిక్స్ కార్డ్ : మీరు ఎక్కువగా గేమ్స్ ఆడేవారైతే ఇది అవసరం. ఒక వేళ కొనదలుచుకుంటే nVidia మంచిది.
  4. హార్డ్ డ్రైవ్ : చాలా మందికి 160GB లేదా 250GB సరిపోతుంది.
  5. కెమెరా : కొత్తలో కొన్న ముచ్చటే కానీ ఇది అవసరం రాదు.

లినక్స్ లో ఇంటర్నెట్ నుండి సాఫ్టేర్ ఇంస్టాల్ చేయటం ఎలా?

ఇది చాలా సులబమైన పద్దతి.

మీరు ఉబుంటూ వాడుతున్నారని అనుకొంటూ ఈ టపా వ్రాయటం జరిగింది.

కావలసినవి :

  1. మీ కంప్యూటర్ లో ఉబుంటూ ఇన్‌స్టాల్ చేసి ఉండటం.
  2. ఇంటెర్నెట్ కనెక్షన్ ఉండటం. (ఒకవేల మీ ఇంటెర్నెట్ కనెక్షన్ బ్రాడ్-బ్యాండ్ అయితే ఎలా కనెక్ట్ చెయ్యాలో ఇక్కడ వ్రాసి ఉంది.)

ఇక ఇన్‌స్టాల్ చేసే పద్దతికి వస్తే…

  1. సిస్టమ్(System) లో ఆడ్మినిస్ట్రేషన్(Administration) లో సినాప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్(Synaptic package manager) క్లిక్ చెయ్యండి, పాస్‌వర్డ్ (password) అడుగుతుంది, ఇవ్వండి.
  2. కొత్త విండొ ఓపెన్ అవుతుంది, పైన రిలోడ్(Reload) అనే బటన్ ఒకటి ఉంటుంది, దానిని క్లిక్ చెయ్యండి, కొంత డౌన్‌లోడింగ్ జరుగుతుంది.
  3. మీకు కావలసిన సాఫ్ట్‌వేర్ ఆ విండోలో ఉన్న లిస్ట్‌లో వెతికి (టైప్ చేస్తే చాలు సర్చ్ చేసి ఇస్తుంది) దాని మీద రైట్ క్లిక్ చేసి ‘మార్క్ ఫోర్ ఇన్స్టలేషన్‘(Mark for Installation) అని క్లిక్ చెయ్యాలి ఒక వేల ఇంకో విండొ ఓపెన్ అయ్యి లిస్ట్ చూపిస్తే అక్కడ కూడా మార్క్ అనే బటన్ని క్లిక్ చెయ్యటమే.
  4. చేసి అప్లై(Apply) అనే బటన్ క్లిక్ చెయ్యగానే ఇంకొక విండొ ఓపెన్ అవుతుంది, అందులో కూడా అప్లై(Apply) అనే బటన్ని క్లిక్ చెయ్యాలి.

    ఇలా చెయ్యగానే, ఇంటెర్నెట్లో నుంచి కావలసిన ప్యాకేజ్లను డౌన్‌లోడ్ చేసి ఆ సాఫ్ట్‌వేర్ని ఇన్‌స్టాల్ చేసేస్తుంది.